Young Man Protest for King Fisher Lite Beers : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటిందంటే చాలు సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ వేడిమి నుంచి కాస్త ఉపశమనం కోసం జనాలు కూలర్లు, కూల్ వాటర్, కూల్‌డ్రింక్‌ల వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. అదే కాస్త మద్యం సేవించే అలవాటు ఉన్న వాళ్లైతే ఎంచక్కా బీర్లతో చిల్ అవుతున్నారు. ఏడాది మొత్తంలో జరిగే బీర్ల అమ్మకాల కంటే, ఈ 2 నెలల్లో జరిగే బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే మామూలు సమయాల్లో బీర్ల కంటే మందు ఎక్కువగా పుచ్చుకునే మన మందుబాబులు, ఈ 2 నెలలు మాత్రం మందుకు కాస్త దూరంగా ఉంటూ బీర్లను తెగ తాగేస్తుంటారు.
మరీ ముఖ్యంగా యువత అయితే పార్టీలు, సాయంత్రం వేళ సిట్టింగ్‌లు అంటూ కాటన్లకు కాటన్లు తాగేస్తుంటారు. మంచినీళ్లు తాగినట్లే బాటిళ్లకు బాటిళ్లు లేపేస్తుంటారు. బీర్లు అంటే వారికి అంత ప్రేమ మరి. అయితే అంతటి ఇష్టమైన బీర్ల కోసం బార్ల వద్ద బారులుతీరైనా, వైన్సుల వద్ద ముష్టి యుద్ధాలు చేసైనా సరే బాటిల్ దొరికే వరకు వెనక్కి తగ్గేదే లే అంటూ లైన్లలో వెయిట్ చేస్తుంటే, కొన్నిచోట్ల మాత్రం వారికి ఇష్టమైన బ్రాండ్లు దొరక్క వారి వెయిటింగ్‌కు వెయిటేజీ లేకుండా చేస్తున్నాయి. మద్యంప్రియులంతా ముక్తం కంఠంతో కోరుకునే 'కేఎఫ్ బీర్లు' వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. కావాల్సిన బీరు దొరకట్లేదనే సగటు మందుబాబు బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు. వైన్సుల్లో ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, కొన్నిసార్లు గొడవలకు దిగినా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు. ఎన్ని వైన్సులు తిరిగినా, ఏ బార్లో అడిగినా 'కేఎఫ్ నో స్టాక్' అనే మాటే వినిపిస్తుంది.
అయ్యా కలెక్టర్ సార్.. మా ఊర్లో కింగ్‌ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఫిర్యాదు