ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మేరుగు నాగార్జున - ముచ్చట్లలో మర్మమేంటి ? - MERUGU NAGARJUNA AT AQUA COMPANY MD - MERUGU NAGARJUNA AT AQUA COMPANY MD

Minister Merugu Nagarjuna at Sandhya Aqua Company MD House: విశాఖలో దొరికిన డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నది టీడీపీ నేతలేనంటూ సీఎం జగన్ పదే పదే చెప్తున్నారు. కానీ ఆ వ్యవహారంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉన్నది వైసీపీ నేతలేనని స్పష్టం అవుతుంది. కొద్ది రోజుల క్రితం ఎంపీ విజయసాయి రెడ్డి ఆ డ్రగ్స్ దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా సంస్థ ఎండీ సోదరుడు, వైసీపీ నేత కూనం పూర్ణచంద్రరావును కలవగా ఇప్పుడు తాజాగా మంత్రి మేరుగు నాగార్జున ఇంటికి వెళ్ల మరీ కలవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

minister_merugu_nagarjuna
minister_merugu_nagarjuna

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 7:58 AM IST

Minister Merugu Nagarjuna at Sandhya Aqua Company MD Brothers House:వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్‌ విశాఖ పోర్టులో దొరికిన మాదక ద్రవ్యాల వ్యవహారంతో పలు ఆరోపణలు చేశారు. డ్రైడ్‌ ఈస్ట్‌ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ దాడి చేసి పట్టుకున్న విషయం అందరికీ తెలుసు. అయితే టీడీపీ నాయకులు ఉలిక్కిపడి ఆ నిందను మన మీదకు (వైసీపీ) నెట్టేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఆ కంపెనీలో సాక్ష్యాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, చంద్రబాబు వదినమ్మ గారి కొడుకు, వియ్యంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములుగా ఉన్నారు. ఇక నేరమంటూ జరిగితే అది చేసిందేమో వాళ్లు తోసేది మనమీద అంటూ వ్యాఖ్యానించారు. కానీ జగన్ కేబినేట్​లోని మంత్రి మేరుగు నాగార్జున రహస్యంగా సంధ్య ఆక్వా సంస్థ ఎండీ సోదరుడి ఇంటికి వెళ్లడం చర్చానీయాంశంగా మారింది.

జగన్‌ కేబినెట్‌లో మంత్రి, సంతనూతలపాడు అభ్యర్థి మేరుగు నాగార్జున డ్రైడ్‌ ఈస్ట్‌ పేరుతో మాదక ద్రవ్యాలు దిగుమతి అయిన అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంధ్య ఆక్వా సంస్థ ఎండీ సోదరుడు, వైసీపీ నేత కూనం పూర్ణచంద్రరావు ఇంటికి వెళ్లారు. అక్కడ ఏం మాట్లాడారో బయటకు తెలియకూడదని జాగ్రత్తపడుతూ ఆయన వెంట కార్యకర్తలెవరినీ తీసుకెళ్లలేదు. ఫొటోలు, వీడియోలు కూడా తీయవద్దని అన్నారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఆయనతో భేటీ అయ్యారు. అలానే ఎమ్మెల్యే సుధాకర్‌బాబు కూడా అదే ఇంట్లో అతిథి మర్యాదలు అందుకున్నారు. మరి ‘సంధ్య ఆక్వా’ కుటుంబానికి ఏ పార్టీతో సంబంధాలున్నాయి ఎవరు ఎవరిమీద తోస్తున్నారు జగన్‌ అనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ విదేశీయుడు - సంధ్య ఆక్వా పరిశ్రమకు రావటంపై అనుమానాలు - Foreigner Caught with Cash

ప్రొద్దుటూరులో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు మంత్రి మేరుగు నాగార్జున పూర్ణచంద్రరావును కలిసినదీ బుధవారమే. వైసీపీతో సంధ్య ఆక్వా సంస్థ కుటుంబానికి ఉన్న సంబంధాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా జగన్ ఇంకా అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు వదినగారి చుట్టం అంటూ ప్రతిపక్షంపై బురద జల్లుతున్నారు. ఎవరు ఎవరిమీద తోస్తున్నారో స్పష్టంగా ప్రజలకు కనిపిస్తున్నా ఇంకా నమ్మించాలనే ప్రయత్నంలో ఉన్నారు. బ్రెజిల్‌ నుంచి వచ్చిన డ్రైడ్‌ఈస్ట్‌లో మాదక ద్రవ్యాల అవశేషాలు ఉన్నాయంటూ సీబీఐ కేసు నమోదు చేసిన వ్యవహారం సంచలనం సృష్టించింది.

నాలుగు రోజులుగా ఒకేచోట ఉన్న సంధ్య ఆక్వా బస్సులో తనిఖీలు- ఫైల్స్, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం - CHECKINGS IN SANDHYA AQUA BUS

ఇంత జరిగాక కూడా మేరుగు నాగార్జున రహస్యంగా వైసీపీ నేత పూర్ణచంద్రరావు ఇంటికి వెళ్లారు. జగన్‌కు తెలియకుండా ఆయన అక్కడికి వెళ్లగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహకార పరపతి సంఘం త్రీమెన్‌ కమిటీ ఛైర్మన్‌గా పూర్ణచంద్రరావును నియమించింది కూడా వైసీపీ ప్రభుత్వమే. సంక్రాంతికి ఊళ్లో వేసిన బ్యానర్లలో ఉన్న ఫొటోలు కూడా జగన్‌, రాజశేఖరరెడ్డి, వైసీపీ నేతలవే. ఎంపీ విజయసాయిరెడ్డితో పూర్ణచంద్రరావు జరిపిన రాజకీయ చర్చలూ సామాజిక మాధ్యమాల్లో బయటకొచ్చాయి. అయినా ముఖ్యమంత్రి మాత్రం అబద్ధాలు వల్లెవేయడం గమనార్హం.

వైసీపీ పాలనలో అన్ని రంగాలు లాస్ట్​ - డ్రగ్స్​ స్మగ్లింగ్​లో దేశంలోనే టాప్​ - DRUGS SMUGGLING IN AP

ABOUT THE AUTHOR

...view details