Yanamala Letter to CM Chandrababu :ఏపీ ఆర్ధిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే తన పరిశీలనలు, సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు వైఎస్సార్సీపీ నాయకులు మింగేసిన డబ్బును రెవెన్యూ రికవరీ చట్టం అమలు, లేదా ఏదైనా ఇతర ప్రత్యేక చట్టం ద్వారా తిరిగి రాబట్టాలని ఆయన సూచించారు.
జగన్ సర్కార్ గత ఐదేళ్లలో చేసిన ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన, సానుకూల పురోగతి చర్యలు అభినందనీయమని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. మాజీ ఆర్థిక మంత్రిగా తన అనుభవంతో 15 అంశాలను సూచిస్తున్నట్లు చెప్పారు. ఇవి ఎన్నికల మేనిఫెస్టో అమలుకు తోడ్పాటుతో పాటు, రాష్ట్ర ఖజానా, ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని యనమల లేఖలో అభిప్రాయపడ్డారు.
Yanamala on AP Economic Situation : పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించడం, కేంద్రం నుంచి అధిక డెవల్యూషన్ (41 లేదా 42శాతం) వాటాను కోరుతోందని యనమల అన్నారు. సహేతుకమైన స్థిరమైన రుణాలు, ఇప్పుడు కంటే ఎక్కువ గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని తెలిపారు. ఈరోజు నాటికి ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర రుణాల కోసం కేంద్రాన్ని అభ్యర్థించాలని సిఫార్సు చేశారు. అలాగే వెయిన్స్ అండ్ మీన్స్, ఓడిని జాగ్రత్తగా ఉపయోగించాలని లేఖలో పేర్కొన్నారు.