Wife and Husband Suspicious Death in Farm:వ్యవసాయ పొలాల వద్ద దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలోని శాంతి నగర్‌కు చెందిన ముదాం వెంకటేష్ (40), వసంత (36) భార్యాభర్తలు. వీరికి ఒకటో తరగతి చదువుతున్న కుమార్తె (వర్షిణి), 7వ తరగతి చదువుతున్న కుమారుడు (అజిత్) ఉన్నారు.
భర్త, భార్యను కర్రతో కొట్టి హత్య చేసిన అనంతరం అతను పురుగుల మందు తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా, కర్రకు రక్తపు మరకలు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నడిరోడ్డుపై తల్లీకుమారుడి హత్య : మరోవైపు నడిరోడ్డుపై తల్లీకుమారుడి హత్య సంగారెడ్డి జిల్లా కలకలం రేపింది. గుమ్మడిదల మండలం బొంతపల్లిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సరోజ దేవి, ఆమె కుమారుడు అనిల్‌లను బిహార్‌కు చెందిన నాగరాజు నడిరోడ్డుపై అతి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. నాగరాజు రెండేళ్ల కుమారుడు కొన్ని రోజుల క్రితం చనిపోయాడని, దీనికి ఆ తల్లీకుమారులే కారణం అని నిందుతుడు తెలిపారు. అంతేకాకుండా తన భార్యపై దాడికి కూడా వచ్చారని అందుకే ఈ హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆరేళ్లు సహజీవనం - పత్తి చేనులో ఆరడుగుల గొయ్యి బహుమతి
బెజవాడలో భూయజమాని హత్యకు 'సుపారీ గ్యాంగ్' - తెర వెనక వైఎస్సార్సీపీ నేత