Irrigation Minister Reviews on Polavaram : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై, ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కమిషనర్ రామసుందర్‌రెడ్డి, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. పోలవరం పనుల తీరుపై మంత్రి అధికారులతో కలిసి ఈ సమావేశంలో చర్చించారు.
మరోసారి పోలవరం ప్రధాన డ్యాం అంచనాలు పెంపు - ఎన్ని వేల కోట్లంటే ?
డిసెంబరులో పోలవరంలో పర్యటించనున్న సీఎం:డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పోలవరంలో పర్యటిస్తారని రామానాయుడు అధికారులకు తెలియజేశారు. డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల షెడ్యూలుపై మంత్రి వారితో సమీక్షించారు. పోలవరం కుడికాలువను అనుసంధానించే సొరంగాలు, మిగులు పనులు, లెప్ట్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా ఓ వెబ్సైటును ప్రారంభించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలియచేయాలని ఆయన ఆదేశించారు.