Water Release in pattiseema Eluru District :ఏలూరు జిల్లా పట్టిసీమ నుంచి కృష్ణా నదికి గోదావరి నీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. మొత్తం 14 పంపులను అధికారులు స్విచ్ ఆన్ చేశారు. వాటి ద్వారా సుమారు నాలుగు వేల క్యూసెక్కుల నీరు కృష్ణా నదికి చేరుతోంది. గోదావరికి ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో పట్టిసీమ పంపులను ఆన్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
2014-2019 సంవత్సరం మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ పట్టిసీమకు రూపకల్పన చేశారు. అప్పట్లోనే దీనికి మొదటి సారిగా నీటిని విడుదల చేశారు. అయితే 2019 లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసింది. తరువాత మళ్లీ ఇప్పుడు ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరుణంలో పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేయడం విశేషం. ఈ ప్రాజెక్టు వలన సకాలంలో వ్యవసాయ భూములకు నీరు అంది పొలాలన్నీ సమృద్ధిగా ఉంటాయి. దీని ద్వారా కృష్ణా జిల్లాలో గల పలు వ్యవసాయ భూములు సస్యశ్యామలం కానున్నాయి.