Visakha Steel Plant Workers Fires On YS Jagan :స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తానే అడ్డుకుంటూ వచ్చానని గాజువాక సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడంపై కార్మికులు మండిపడుతున్నారు. 11 వందల 80 రోజులకుపైగా కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరవధిక దీక్షలు చేస్తుంటే పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని మళ్లీ స్టీల్ ప్లాంట్‌పై కపట ప్రేమ చూపిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోసపూరిత మాటలను నమ్మే పరిస్థితి లేదని తెగేసి చెబుతున్నారు.
విశాఖ ఉక్కు ఊపిరి తీశారు - మెడలు వంచుతామని కేంద్రం ముందు సాగిలపడ్డ జగన్
Visakha Steel Plant Workers Problems :గాజువాకలో కూటమి అభ్యర్థి గెలిస్తే, ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎవరూ ఆపలేరు అని అన్నారు. రైల్వే జోన్ కోసం భూములు ఇచ్చినా లిటిగేషన్ పెట్టారని, జోన్ అంటే రెండు బిల్డింగులు కాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా ఇప్పుడు గాజువాకలో ఓట్ల కోసం సరి కొత్త నాటకం మొదలు పెట్టారని ధ్వజమెత్తారు.
స్టీల్‌ప్లాంట్ ప్రయోజనాలే మాకు ముఖ్యం - బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించాలి : హైకోర్టు - High Court On Visakha Steel Plant
'ఐదు సంవత్సరాల నుంచి కార్మికులను ముప్పతిప్పలు పెట్టారు. ప్రైవేటీకరణ ప్రకటన గురించి ఒక్క సారైనా స్పందించారా? మీరు కార్మిక వ్యతిరేక ముఖ్యమంత్రి. మరో ఐదు రోజుల్లో మీకు ఓటుతో బుద్ధి చెప్తాం. వేల మందికి ఉపాధి కల్పించే విశాఖ ఉక్కు కార్మాగారం, కార్మికులను మీ ఐదేళ్ల రాక్షస పాలనలో రాచి రంపాన పెట్టారు.' - కార్మికులు
'ఎన్నికలు వచ్చాయని మళ్లీ స్టీల్ ప్లాంట్‌పై కపట ప్రేమ- జగన్ మోసపూరిత మాటలు నమ్మే పరిస్థితి లేదు' (ETV Bharat) స్టీల్ ప్లాంటు నష్టాల్లో ఉందా - సీఎం జగన్ ఆశ్చర్యం - గెలిపించండి లాభాల్లోకి తెద్దాం - JAGAN ON VISAKHA STEEL PLANT
Steel Plant Workers on Elections : స్టీల్ ప్లాంట్‌కి రెండు కిలోమీటర్ల దూరం కూడా లేని వైఎస్సార్సీపీ నేతకు సైతం మా కష్టాలు కనిపించలేదని కార్మికులు మండిపడ్డారు. ఆంధ్రుల హక్కును కాలరాసిన మీకు ఓటు వెయ్యడం జరగని పని అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసి మళ్లీ ఓట్లేలా అడుగుతున్నారని వారు మండిపడ్డారు. వందల రోజులు వేలాది మంది కార్మికులు నిరసనలు చేసినా కనబడని జనాలు ఓటు కోసం కనిపిస్తున్నారా అని ధ్వజమెత్తారు.
'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' నినాదంతో కార్మిక సంఘాల మహాపాదయాత్ర