ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉక్కు ఉద్యోగులకు వేతన సమస్య తుప్పు- సకాలంలో వేతనాలు అందక అవస్థలు - VISAKHA STEEL EMPLOYEES - VISAKHA STEEL EMPLOYEES

Visakha Steel Plant Employees Salaries: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగం అంటే ఒకప్పుడు గొప్ప! కానీ ఇప్పుడు చెప్పుకుంటే సిగ్గుపోయేలా పరిస్థితి తయారైంది. కనీసం వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియడంలేదు! బొగ్గు కొరత సమస్య తీరిందనుకునేలోపే స్టీల్‌ప్లాంట్‌కు విద్యుత్‌ బిల్లుల బకాయి రూపంలో మరో కష్టం ఎదురొచ్చింది. ఫలితంగా నిర్వహణే భారంగా మారింది.

Visakha Steel Plant Employees Salaries
Visakha Steel Plant Employees Salaries (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 10:04 AM IST

Visakha Steel Plant Employees Salaries :విశాఖ స్టీల్ ప్లాంట్లో 18 వేల మంది రెగ్యులర్ కార్మికులు 18 వేల మంది ప్రైవేట్ కార్మికులు అనుబంధ పరిశ్రమల మీద మరో 25 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఏడు వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి దిశగా కొనసాగేది కాస్త గత కొద్ది రోజులుగా గంగవరం పోర్ట్ ఉద్యమం వల్ల 20 రోజులు పాటు బొగ్గు లేక చాలా తక్కువ ఉత్పత్తితో నడిచింది. ఇప్పుడు ఆ సమ్మె విరమించడంతో పూర్తి సామర్థ్యంతో నడవడానికి సిద్ధమవుతోంది. కానీ ఇంతలోనే విద్యుత్ బిల్లులు చెల్లించలేక, ఉద్యోగులకు సకాలంలో జీతాలు లేక విశాఖ స్టీల్ ప్లాంట్ సరికొత్త సమస్యతో తల్లడిల్లుతోంది.

స్టీల్​ ప్లాంటు నష్టాల్లో ఉందా - సీఎం జగన్​ ఆశ్చర్యం - గెలిపించండి లాభాల్లోకి తెద్దాం - JAGAN ON VISAKHA STEEL PLANT

Visakha Steel Employees Wages :స్టీల్ ప్లాంట్ కార్మికుల గత నెల 17వ తారీఖున కానీ జీతాలు పడలేదు. ఈ నెల ఇంకా జీతాలు ఇవ్వని పరిస్థితి. చాలామంది ఉద్యోగులు గృహ రుణాలని వారి పిల్లల చదువులకి రుణాలని బ్యాంకు రుణాలు తీసుకుని ఆ రుణాల చెల్లించలేక నోటీసులు అందుకున్న పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థకు స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం 68 కోట్ల రూపాయలు చెల్లించాల్సిఉంది.

గంగవరం పోర్టు కార్మికుల సమ్మె - విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిపై ప్రభావం - Visakha Steel Plant production

ఉక్కు ఉద్యోగులకు వేతన సమస్య తుప్పు- సకాలంలో వేతనాలు అందక అవస్థలు (ETV Bharat)

ఇప్పుడు ఈ 68 కోట్లు చెల్లించకపోతే వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి తూర్పు కోస్తా విద్యుత్ పంపిణీ సంస్థ చెప్తోంది. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం తమ వల్లే ఆగిపోయిందని చెప్తుంటే, మరోవైపు అదే రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ సంస్థ కేవలం రూ.68 కోట్లు కట్టలేదని విద్యుత్ నిలిపివేస్తామని అంటున్నారు. ఒక పక్క విద్యుత్ బిల్లు చెల్లింపు మరోపక్క ఉద్యోగుల జీతాలు చెల్లింపు ఈ రెండూ కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్​ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 20 రోజులు పాటు బొగ్గు నిల్వలు లేక బ్లాస్ట్ ఫర్నిస్ ఆగిపోతుందేమో ఆందోళనతో ఉద్యోగులు ఆవేదన చెందారు. ఈ 20 రోజులు ఉత్పత్తి విషయంలో జరిగిన ఆలస్యం వల్ల సుమారుగా 33 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్​కు నష్టం వచ్చింది.

సరైన సమయానికి జీతాలు ఇవ్వకపోడంతో ఉద్యోగులు కుటుంబ పోషణ కష్టంగా మారింది. స్టీల్‌ ప్లాంట్‌ని సెయిల్‌లో విలీనం చేయడమే సమస్యలకు శాశ్వత పరిష్కారమని ఉద్యోగుల సంఘాల నేతలు సూచిస్తున్నారు.

'ప్రశ్నించే నాయకుడు ఏపీలో లేరు - ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుందాం'

ABOUT THE AUTHOR

...view details