Vijayawada Social Media Influencers: సోషల్ మీడియాను చక్కని వేదికగా చేసుకుని ఉపాధి మార్గంగా ఎంచుకుని, వీక్షకుల ఆదరణ పొందుతున్నారు విజయవాడకు చెందిన పలువురు. వినోదం, సందేశాత్మక షార్ట్స్‌తో అలరిస్తున్నారు. తమ నటనతో మెప్పిస్తూ లక్షల్లో సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకున్నారు. వేల నుంచి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వీరంతా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. మహిళలు తమ పిల్లలను మంచిగా చదివిస్తున్నారు. ఆర్థికపరంగా ఉన్న ఇబ్బందులను అధిగమిస్తున్నారు.
మహ్మద్ ఆరిఫ్ (ETV Bharat) నాన్నే స్ఫూర్తి: మాంసం దుకాణం నడుపుతూ మంచి వీడియోలు చేస్తూ యూట్యాబ్‌లో పాపులర్ బెజవాడ మస్తాన్ అయ్యారు. తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన కుమారుడు మహ్మద్ ఆరిఫ్ రీల్స్ చేస్తున్నారు. కామెడీ, సందేశాత్మక షార్ట్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నారు. వాటి ద్వారా చిన్న వయసులోనే సంపాదిస్తున్నారు. అదే విధంగా వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ వంటివి చేస్తున్నారు.
బొజ్జగాని తిరుపతిరావు (ETV Bharat) మీ కష్టాన్ని నమ్ముకోండి: బొజ్జగాని తిరుపతిరావు డ్రైవర్‌గా టాటా ఏస్ వాహనం నడపుతూ జీవనం సాగించేవారు. సోషల్ మీడియాపై మంచి పట్టు ఉంది. చాలీచాలని డబ్బుతో అవస్థలు పడే ఈయన, నాలుగు సంవత్సరాలుగా సందేశాత్మక వీడియోలు చేస్తున్నారు. దీనిద్వారా వచ్చే ఆదాయంతో ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నారు. ఏ రంగంలోనైనా కష్టాన్ని నమ్ముకుంటే ప్రతిఫలం తప్పకండా వస్తుందని తిరుపతిరావు చెబుతున్నారు.
బెస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ - ఏపీ 'పర్యాటక శాఖ యూత్ ఐకాన్'గా ఇందిరా ప్రియదర్శిని
మానేపల్లి యతీష (ETV Bharat) సమాజంలో ఉన్నతంగా బతకాలని:మానేపల్లియతీష ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఆమె భర్త మధు ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో సెల్ ఫోన్ షాపు నిర్వహస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. సొసైటీలో ఉన్నతంగా బతకాలన్నది ఆమె ఆశయం. కామెడీ వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుతో భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డిన యతీష, తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నది కోరుకుంటున్నారు. కొత్తగా యూట్యాబ్ ఛానల్ ప్రారంభించిన ఆమె, మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు.
వీరమల్ల జ్యోతి (ETV Bharat) సందేశాత్మక వీడియోలతో గుర్తింపు:వీరమల్ల జ్యోతిరెండేళ్ల నుంచి రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళలు, ఆడపిల్లల భద్రత, సొసైటీలో ఎదురవుతున్న ఇబ్బందులు, మధ్య తరగతి మహిళల పరిస్థితులపై వీడియోలు చేస్తున్నారు. మహిళలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా ఉండాలన్నది ఆమె ఆశయం. ఈమె తండ్రి టైలర్. చిన్నప్పుడు చదువుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డామని, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చక్కని వీడియోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈమె భర్త బ్యాంకు ఉద్యోగి. వీరికి ఒక కుమార్తె ఉంది.
పల్లెపోగు శ్రుతి (ETV Bharat) యువతలో మంచి క్రేజ్:పల్లెపోగు శ్రుతి అనతికాలంలోనే యూత్‌లో మంచి పాపులర్ అయ్యారు. ఆమె చేసిన వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో నగరంలోని పలు కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేందుకు ఆమెతో ప్రమోషన్ చేయించుకుంటున్నారు. గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా చేసిన వీడియోలు అలరిస్తున్నారు. ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాలో నటించారు. పలు సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. యువత ఉద్యోగాలపైనే ఆధారపడకుండా, సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ఆమె పేర్కొంటున్నారు.
ఇండియాలో రిచెస్ట్ యూట్యూబర్ ఇతడే- అప్పడు రూ.5వేల జీతం- ఇప్పుడు రూ.కోట్లలో సంపద