VijayawadaPeople Suffer With Discolored Water :విజయవాడ ప్రజలు తాగు నీటి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీఎంసీ విడుదల చేస్తున్న తాగు నీరు గోధుమ రంగులో వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్న విజయవాడ నగర పాలక సంస్థ తాగడానికి మాత్రం స్వచ్ఛమైన నీరు అందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం విజయవాడలోని మొగల్రాజపురం, పాయకపురం ప్రాంతాల్లో కలుషిత నీళ్ల కారణంగా డయేరియా విజృంభించిందని, దీంతో పలువురు మృత్యువాత పడడంతో పాటు తీవ్ర అస్వస్థకు గురయ్యారని ప్రజలు వాపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
విజయవాడలో కోరలు చాచుతున్న డయేరియా - ఇంకా కళ్లు తెరవని నగర పాలక సంస్థ! - Contaminated Drinking Water
Drinking Water Problem in Vijayawada :ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమట, మొగల్రాజపురం, వన్ టౌన్ ప్రాంతంలోని పలు కాలనీల్లో వీఎంసీ విడుదల చేస్తున్న నీరు సక్రమంగా రావడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వీఎంసీ విడుదల చేస్తున్న నీరు రంగు మారి రావడంతో పాటు మట్టి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు పురుగులు సైతం కుళాయిల్లో వస్తున్నాయని వాపోతున్నారు. దీంతో ఆ నీరు తాగలేక ప్రైవేట్ వాటర్ ప్లాంట్లకు వెళ్లి నీళ్లు కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. ఆర్వో వాటర్ ప్లాంట్లలోని నీళ్లు రోజూ తాగడం వల్ల మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. నీటి పన్ను వసూలు చేస్తున్న వీఎంసీ తమకు తాగడానకి స్వచ్ఛమైన నీళ్లు అందించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.