ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"బెజవాడ బేగంబజార్" - అక్కడకు వెళ్తే దొరకని వస్తువే ఉండదు! - VIJAYAWADA ONE TOWN MARKET

ఏపీలో వ్యాపార కేంద్రానికి కేంద్ర బిందువుగా విజయవాడ - వన్ టౌన్‌కు వ్యాపార రంగంలో ప్రత్యేక గుర్తింపు

Vijayawada_One_Town_Market
Vijayawada One Town Market (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2024, 5:04 PM IST

Updated : Oct 22, 2024, 3:15 PM IST

Vijayawada One Town Market :ఏ చిన్న శుభాకార్యమైనా, పండగలైనా, నూతనంగా నిర్మించిన ఇంటికైనా, ఇంట్లో సరుకులకైనా అన్ని వస్తువులూ అక్కడే దొరుకుతాయి. హోల్ సేల్ నుంచి రిటైల్​తో పాటు చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ప్రజలు ఎంచుకునేది విజయవాడలోని వన్ టౌన్. ఇక్కడ దొరకని వస్తువు ఉండదు అనడానికి అతిశయోక్తి కాదు. నగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. అంతటి ప్రత్యేకత ఉన్న వన్ టౌన్ వ్యాపార సముదాయాలపై ప్రత్యేక కథనం.

రాష్ట్రంలో వ్యాపార కేంద్రానికి కేంద్ర బిందువుగా ఉంది బెజవాడ. నగరానికి తలమానికంగా ఉన్న వన్ టౌన్​కు వ్యాపార రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. శివాలయం వీధి, కాళేశ్వర మార్కెట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. వ్యాపారులు హోల్ సెల్, రిటైల్​గా విడివిడిగా అమ్మకాలు జరుపుతుంటారు. అన్ని రంగాలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

ఆటో మోబైల్స్, పచారి, బ్యాంగిల్స్, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం, ఇత్తడి, రాగి, గృహోపకరణాలు, ఇంటి సరుకులు, పండ్లు, కూరగాయలు, తినుబండారాలు, బట్టలు, సైకిళ్లు తదితర వస్తువులన్నీ ఒక్క చోటే లభిస్తుండటంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

కొత్తవాటితో పాటు పాతవి - ఇక్కడ దొరకని పుస్తకమంటూ లేదు - Special Story on Lenin Center

పెళ్లిళ్లు, పండుగలకు కుటుంబసమేతంగా వచ్చి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. హోల్ సెల్ ధరలకే వస్తువులు లభిస్తుండటంతో ఈ ప్రాంతమంతా నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటుంది. ఇక సెలవు రోజుల్లో చెప్పనక్కర్లేదు. వన్ టౌన్​లో అవసరమైన వస్తువుల్నీ ఒకే దగ్గర ఉండటం, పైగా తక్కువ ధరలో లభిస్తుండటంతో నగరంలో ఎక్కడి నుంచైనా సరే ఇక్కడికి వచ్చి కొంటామని ప్రజలు చెబుతున్నారు.

వన్ టౌన్​లోని చిన్నా, పెద్ద దుకాణాలు కలిపి కొన్ని వేలల్లో ఉంటాయి. నగరంలోని చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు, పలు జిల్లాల నుంచి ఫ్రిజ్, ఏసీ, బైక్ మెకానిక్​లు, ఎలక్ట్రీషియన్​లతో పాటు వివిధ పనులు చేసుకునే వారు తమకు కావాల్సిన వస్తువులను ఇక్కడకు వచ్చి తీసుకెళ్తుంటారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన వారు సైతం అమ్మవారి దర్శనం తర్వాత ఇక్కడకు వచ్చి పలు వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. రిటైల్ వ్యాపారులు తమ దుకాణాల్లోకి కావాల్సిన సరుకులను వన్ టౌన్​లోనే పెద్ద మెుత్తంలో కొనుగోలు చేస్తుంటారు. ఏదైనా వస్తువు కోసం ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దొరుకుకుందని నమ్మకంతో ప్రజలు తమ వద్దకు వస్తారని వ్యాపారులు చెబుతున్నారు.

విజయవాడ రైల్వేస్టేషన్‌కు అరుదైన ఘనత - ఎన్‌ఎస్‌జీ1గా గుర్తింపు - NSG 1 designation for Vijayawada

Last Updated : Oct 22, 2024, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details