Vidwamsam Book Writer Alapati Suresh Kumar Interview :"సీఎం జగన్ మోహన్ రెడ్డి సింహం అని అధికార పార్టీ నేతలు, అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి సీఎం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ జగన్‌లో తీవ్ర అభద్రతాభావం, భయం గూడుకట్టుకొని ఉన్నాయి. జగన్ సింహం కాదు, చిట్టెలుక. సింహం సింగిల్ గా వస్తుందన్న సినిమా డైలాగులు వినడానికే బాగుంటాయి కానీ నిజానికి అడవిలో ఏ సింహమూ సింగిల్‌గా ఉండదు. ఒక్కటే వేటాడదు. అవి గుంపులుగా ఉండి జంతువులను వేటాడి చంపుతాయి. జగన్‌తో కలిసేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రానందునే వైఎస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. దీన్నే సింగిల్ వస్తున్నామంటూ భ్రమ కల్పిస్తున్నారు" అని 'విధ్వంసం' పుస్తక రచయిత ఆలపాటి సురేశ్ కుమార్ విశ్లేషించారు. జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో వివిధ వ్యవస్థలపై జరిగిన దాడిని వివరిస్తూ ఆయన 'విధ్వంసం' పేరిట పుస్తకాన్ని రచించారు. జగన్ పాలనా తీరుతెన్నులపై సురేశ్ కుమార్ ఇటీవల విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాపులను మోసం చేసిన జగన్ - టీడీపీ అమలు చేసిన పథకాలూ ఎత్తివేత - YS Jagan Cheated Kapu Community
బెయిల్ కోసం రాయబారానికి వెళ్తే, వీరుడా? :అవినీతి కేసుల్లో జగన్‌ను జైలుకు పంపితే ఎలాగైనా బెయిల్ వచ్చేలా చేసి, బయటకు తేవాలంటూ తల్లిని, చెల్లిని దిల్లీలోని సోనియా గాంధీ వద్దకు రాయబారానికి పంపారు. ఈ విషయాన్ని స్వయంగా షర్మిల ఇటీవల బయటపెట్టారు. ఇవన్నీ ప్రజలకు తెలియనందున జగన్ వీరుడు, శూరుడని ప్రచారం చేసుకుంటున్నారు. సోనియాకే ఎదురొడ్డి నిలబడ్డారని గొప్పలు చెప్పారు. కానీ నిజాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయి. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రో కో రూపంలో జగన్ అక్రమంగా సంపాదించినందుకే సీబీఐ, ఈడీ కేసులు పెట్టాయి. వాటిలో నిజాలు లేకపోతే ఆ కేసులు ఛార్జిషీట్ల వరకు ఎలా వస్తాయి? సీబీఐ, ఈడీ పెట్టిన అన్ని కేసుల్లోనూ ఏ1గా ఉన్న జగన్, సహ నిందితులతో వేర్వేరుగా డిశ్చార్జి పిటిషన్లు వేయిస్తూ పదేళ్లకు పైగా వాయిదాలపై లాక్కొచ్చారు. వీటిపై ప్రశ్నిస్తే, సమాధానం చెప్పుకోలేరు కాబట్టే జగన్ ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. జగన్‌కు సొంత మీడియా ఉందన్న ధీమాతో ఇంత వరకు మీడియా సమావేశాలు పెట్టలేదు.
వైఎస్సార్సీపీ స్వరం మారింది అప్పుడే :తొలుత జనసేన, బీజేపీ జత కట్టాక వైఎస్సార్సీపీ ఎలాంటి విమర్శలూ చేయలేదు. 'ఈసారి వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను' అని పవన్ కల్యాణ్ ప్రకటించిన మరుక్షణమే వైఎస్సార్సీపీ నేతల దాడి మొదలైంది. 'ఒంటరిగా బరిలోకి దిగు' అంటూ పవన్‌ను అధికార నేతలు రెచ్చగొట్టడం ప్రారంభించారు. రాజకీయ రణరంగంలో ఎవరి వ్యూహాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడితే తన గెలుపు కష్టమని తెలిసే వైఎస్సార్సీపీ పదేపదే పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. ఇది జగన్‌లో తీవ్రభయాన్ని సూచిస్తోంది. గత ఎన్నికలకు ముందు జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందని, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి వారితో చెప్పించారు. గెలిచాక మూడు రాజధానుల నాటకమాడి నమ్మక ద్రోహం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చించలేదు. వాళ్లంటే సీఎం జగన్‌కు భయం కాబట్టే రాజధాని గ్రామాల మీదుగా అసెంబ్లీకి వెళ్లేటప్పుడు ఇళ్ల ముందు పరదాలు కట్టిస్తున్నారు.