ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - అన్నదమ్ములను బలిగొన్న మృత్యువు, ముగ్గురి పరిస్థితి విషమం - Two Brothers Dead in Accident - TWO BROTHERS DEAD IN ACCIDENT

Two Brothers Dead in Road Accident: అనంతపురం జిల్లాలో 44వ నెంబర్​ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందగా, మరో 10 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

TWO BROTHERS DEAD IN ACCIDENT
TWO BROTHERS DEAD IN ACCIDENT (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 12:22 PM IST

Two Brothers Dead Road Accident in Anantapur District :అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి కేరళకు వెళ్తున్న కారు కుక్కను తప్పంచబోయి అదుపు తప్పి బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో అన్నదమ్మలు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. కారు అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న 27 మంది కూలీల్లో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

వైఎస్సార్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - ఎనిమిది మంది మృతి - Road Accidents at YSR District

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన సాయి కుమార్, చినబాబుగా పోలీసులు గుర్తించారు. అన్నదమ్ములు ఇద్దరు ఫోటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. వివాహ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా వారిని మృత్యువు బలిగొంది. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాపట్లలో ట్రాక్టర్​ బోల్తా - ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు - TRACTOR BOLTHA in bapatla

ABOUT THE AUTHOR

...view details