ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేటు- సీఎం చంద్రబాబు ఆదేశాలతో అప్రమత్తమైన మంత్రులు - Tungabhadra Dam Gate Collapsed - TUNGABHADRA DAM GATE COLLAPSED

Tungabhadra Dam Gate Collapsed: తుంగభద్ర డ్యాం 19వ గేటు వరద తాకిడికి కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కులు విడుదలవుతోందని, కర్నూలు - మహబూబ్ నగర్ జిల్లాల్లోని పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ప్రాజెక్టు తాజా పరిస్థితిపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయటంపై టీబీ డ్యాం అధికారులతో మాట్లాడి తగిన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్​ను ఆదేశించారు.

Tungabhadra Dam Gate Collapsed
Tungabhadra Dam Gate Collapsed (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 8:45 AM IST

Updated : Aug 11, 2024, 1:16 PM IST

Tungabhadra Dam Gate Collapsed :కర్నాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాం 19 వ గేటు కొట్టుకుపోయింది. గత కొద్ది రోజులుగా జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చైన్ లింక్ తెగిపోవటంతో డ్యాం గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ గేట్ నుంచి 40వేల క్యూ సెక్కుల నీరు వృథాగా పోతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నదిలో భారీగా వరద ఉంది. మొత్తంగా లక్ష క్యూసెక్కుల నీరు నదిలో ప్రవహిస్తోందని కర్నూలు - మహబూబ్ నగర్ జిల్లాల్లోని నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

తాత్కాలిక గేటు ఏర్పాటు :తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి పయ్యావుల కేశవ్​లతో మాట్లాడారు. తాత్కాలిక గేటు ఏర్పాటు చేయటంపై టీబీ డ్యాం అధికారులతో మాట్లాడి తగిన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్​ను సీఎం ఆదేశించారు. తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. టీబీ డ్యాం 1960లో నిర్మించిన పాత డిజైన్ కావడంవల్ల స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొందని కేశవ్ చంద్రబాబుకు తెలిపారు. అలాగే నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

వరదల ధాటికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

తుంగభద్ర డ్యామ్‌ గేటు కొట్టుకుపోయిన వెంటనే రాష్ట్రంలోని ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. డ్యామ్ అధికారులతోనూ మాట్లాడినట్లు చెప్పారు. తెల్లవారుజామున గేటు కొట్టుకుపోవడం, ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతుందన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు తుంగభద్ర డ్యామ్ గుండెకాయలాంటిదన్నారు. దీని నమ్ముకుని లక్షలాదిమంది రైతులు పంటలు వేశారని, నీరు వృథాగా పోకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :తుంగభద్ర గేటు ఘటనపై మంత్రి నిమ్మలతో ఫోన్‌లో చంద్రబాబు మాట్లాడారు. సీఎం ఆదేశాలతో ఘటనాస్థలికి ఇంజినీర్ల బృందం వెళ్లిందని, అలాగే ఘటనాస్థలికి సెంట్రల్ డిజైన్ కమిషనర్ వెళ్లారని తెలిపారు. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం చేశామని, నిమ్మల లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించామని అన్నారు. కౌతాలం,కోస్గి, మంత్రాలయం, నందవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

'రిజర్వాయర్ ను ఖాళీ చేయాల్సి రావచ్చు..'

తుంగభద్ర ఆనకట్ట 19వ క్రస్ట్ గేట్ చైన్‌లింక్ తెగిపోవడంపై కర్ణాటక రాష్ట్రం, కొప్పాల జిల్లా ఇన్‌చార్జి మంత్రి శివరాజ్‌ మీడియాతో మాట్లాడారు. గేటు ద్వారా 35 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోందని వెల్లడించారు. గేటు మరమ్మతు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తెలిపారు. జలాశయంలోని 65 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. దాదాపు 65 టీఎంసీల నీటిని ఖాళీ చేయడం తప్ప రిజర్వాయర్‌ భద్రతకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. 20 అడుగుల నీరు ఖాళీ అయితే తప్ప గేటు పరిస్థితి ఏమిటో చెప్పలేమన్నారు.

ఏపీలోకి తుంగభద్రమ్మ - సంతోషంలో రైతులు - Tungabhadra Water Enter in AP

ఎడతెరపి లేని వాన, వరదల ఉద్ధృతి- జలదిగ్భంధంలో జనజీవనం - ap People Suffering With Floods

Last Updated : Aug 11, 2024, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details