TTD Officials Temporarily Closed a Shop Selling Other Religion items symbols in Tirumala : తిరుమలలో అన్యమత గుర్తులు ఉన్న వస్తువులను విక్రయిస్తున్న దుకాణాన్ని టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. హైదరాబాదుకు చెందిన ఓ కుటుంబం సీఆర్ఓ కార్యాలయం ఎదుట ఉన్న దుకాణంలో చేతికి ధరించే కడియాన్ని కొనుగోలు చేశారు. తర్వాత అక్కడి నుంచి అతిథి గృహానికి వెళ్లి చూడగా ఆ కడియంపై అన్యమతానికి సంబంధించిన పేరు, గుర్తు ఉంది.
దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న భక్తులు ఆ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అధికారులు సంబంధిత దుకాణంలో తనిఖీలు నిర్వహించి మూసివేశారు. బాధిత దుకాణదారుడు మాత్రం తాము అమ్మిన వస్తువులపై అన్యమత గుర్తులు ఉన్నట్లు తెలియదని అధికారులకు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.