Tirumala Special Festivals in December : తిరుమలలో కలిగయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. స్వామి రూపాన్ని కనులారా వీక్షించి ధన్యులు అవుతారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారికి ప్రతిరోజూ నిత్య పూజలు, వివిధ సేవలు నిర్వహిస్తారు. విశేష పర్వదినాల్లో శ్రీనివాసుడికి విశేష పూజలు జరుపుతారు. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
డిసెంబర్లో విశేష పర్వదినాలు :
- డిసెంబర్ 1న నాలుగో విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభం
- 11న సర్వ ఏకాదశి
- 12న చక్రతీర్థ ముక్కోటి
- 13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర
- 14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రం
- 15న శ్రీవారి ఆలయంలో కార్తిక దీపోత్సవం
- 16న ధనుర్మాసారంభం
- 26న సర్వ ఏకాదశి
- 29న మాస శివరాత్రి, తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరునక్షత్రం
- 30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం