Trolls Viral on Social Media Against Pinnelli Ramakrishna:ఏపీలోనే కాకుండా పక్క రాష్ట్రాలతోపాటు సామాజిక మాధ్యమాలలో మారుమోగిపోతున్న పేరు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం అతనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే అతను పోలింగ్ రోజు ఈవీఎంలు పగలగొట్టి, హింసకు దిగి ఆ తర్వాత పరారు కావడంతో రామకృష్ణారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ పేలుతున్నాయి.
'నేను నేరుగా చెబుతున్నాను నాకు మాచర్లకు రావాలంటే 2 గంటలు' అన్నోడు 2 కార్లు మార్చి ఎందుకు పారిపోయాడని ఎద్దేవా చేస్తున్నారు. 'పులిరా పులిరా పెద్ద పులిరా ఈవీఎంలు పగలగొట్టి పారిపోయేరా' అని వ్యంగాస్త్రాలు విసురుతున్నారు. 'జూన్ 4 వరకు ఎలా కాలక్షేపం అవుతుందా అనుకున్నాం. తస్సాదియ్యా ఏం కథ మొదలు పెట్టిర్రుపో' అంటూ పిన్నెల్లి ఎపిసోడ్‌లపై జోకులు వేసుకుంటున్నారు. కొన్ని మీమ్స్‌లో రాష్ట్ర పరిస్థితులనూ వివరిస్తూ పిన్నెల్లిపై చురకలు వేస్తున్నారు నెటిజన్స్.
అగమ్యగోచరంగా పిన్నెల్లి రాజకీయ జీవితం - ఏడేళ్లకు తగ్గకుండా శిక్షపడేనా? - Pinnelli Political Career
Trolls Against Pinnelli Ramakrishna: '2 గంటల్లో వచ్చేవాడే కానీ, రోడ్లు బాలేక ఆలస్యమై ఉంటుంద'ని అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. 'మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి మంచివాడు, స్నేహితుడు, సౌమ్యుడు, ఆస్తులు కూడా అంతంతమాత్రమే ఉన్న పిన్నెల్లిని గెలిపించండి' అని సీఎం జగన్ చెబితే ఏమో అనుకున్నాం కానీ, మరీ ఈవీఎంలు పగలగొట్టేంత మంచివాడనుకోలేదని జగన్‌కు చురకలు అంటిస్తున్నారు. 'ఇంత బతుకు బతికి బాత్రూం కమోడ్‌లు తయారుచేసే కంపెనీలో దాక్కోవడమేంట్రా బుజ్జీ' అని కొందరూ సెటైర్లు వేస్తున్నారు.
మరి కొంతమంది 'ఏలేవాడు మనోడైతే ఎన్నేషాలైనా వేయొచ్చ'ని విపరీతంగా జోకులు వేస్తున్నారు. ఓడిపోతారని ముందే తెలియడంతో అందుకే ఎన్నికల అంతరం దాడులు చేసి సోదరులు ఇద్దరు పరారు అయ్యారని ఇప్పుడే ఇలా ఉంటే ఫలితాలు వచ్చాక ఇంకెన్ని వెబ్‌సిరీస్‌లు విడుదల అవుతాయో అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పిన్నెల్లికి జైలుకు వెళితే అతని రాజకీయ భవిష్యత్తు ఇంక ముగిసినట్టేనని కామెంట్లు చేస్తున్నారు.
ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై వెంటనే కేసు పెట్టని అధికారులు - ఎన్నో అనుమానాలు! - MLA Pinnelli Destroying EVM