Thummalabailu Jungle Safari Attracting Tourists :ప్రకాశం జిల్లా డోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లేమార్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో తుమ్మలబైలు జంగిల్ సఫారీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. శ్రీశైలం వెళ్లి వచ్చే వారు ఇక్కడకు వచ్చి తప్పనిసరిగా సఫారీలోతిరగాల్సిందే. 2016లో ఏర్పాటు చేసిన ఈ సఫారీలో దాదాపు 13 కిలోమీటర్లలో ప్రకాశం, నంద్యాల జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతాన్ని చుట్టు ముట్టే విధంగా వాహనంతో రైడ్ నిర్వహిస్తారు.
Somasila Drone Visuals: నల్లమల అటవీలో అద్భుత పర్యటక ప్రాంతాలు
అడవిలో దాదాపు 1500 రకాలు వృక్ష జాతులు :వన్య ప్రాణులు తిరిగే ఈ ప్రాంతంలో వ్యాన్ నుంచి అడవిని వీక్షిస్తూ,గైడ్ చెప్పే విషయాలు వింటూ ఆస్వాదించవచ్చు. ఒక్కోసారి పులులు కూడా కనిపిస్తుంటాయి.తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్న పులులు చెట్లపై వేసిన పంజా గుర్తులు, అడుగు జాడలు కనిపిస్తుంటాయి. వివిధ రకాల పక్షులు కూడా ఇక్కడ నిత్యం తిరుగుతూ ఆనందపరుస్తాయి. ఈ అడవిలో దాదాపు 1500 రకాలు వృక్ష జాతులు ఉన్నాయి. జంతువులజాడ తెలుసుకోడానికి అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలు,జంతువుల కోసం తాగు నీటి ఏర్పాట్లు కూడా ఈ రైడ్‌లో పర్యాటకులు చూసి ఆనందం వ్యక్తం చేస్తుంటారు.