ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్నాడు జిల్లాలో చెట్టును ఢీకొట్టిన కారు - ముగ్గురు మృతి - Road accident in Palnadu district - ROAD ACCIDENT IN PALNADU DISTRICT

Three Died in a Road Accident: పల్నాడు జిల్లాలో చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు గుంటూరు లక్ష్మీపురానికి చెందిన టీటీడీ మాజీ ఉద్యోగి సోమాతి బాలగంగాధర శర్మ, ఆయన భార్యగా గుర్తించారు.

Three Died in a Road Accident
Three Died in a Road Accident (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 9:51 AM IST

Updated : Jun 27, 2024, 12:35 PM IST

పల్నాడు జిల్లాలో చెట్టును ఢీకొట్టిన కారు - ముగ్గురు మృతి (ETV Bharat)

Three Died in a Road Accident :పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద అనంతపురం - గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఇన్నోవా కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు గుంటూరు లక్ష్మీపురానికి చెందిన టీటీడీ మాజీ ఉద్యోగి సోమాతి బాలగంగాధర శర్మ, ఆయన భార్య, కారు డ్రైవర్ నిర్మల్​గా గుర్తించారు.

మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలింపు : ఈ ప్రమాదంలో బాలగంగాధర శర్మతో పాటు ఆయన భార్య యశోద, కారు డ్రైవర్ నిర్మల్ కుమార్ మృతి చెందగా, కారులో ఉన్న ఆడిటర్ హెచ్​ఎస్​వై శర్మ, భార్య నాగసత్య, కుమార్తె అనుపమకు గాయాలయ్యాయి. శర్మ కుమారుడు కార్తీక్​ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత నరసరావుపేట ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు.

చిరుతను తప్పించబోయి కారు బోల్తా - మహిళ మృతి

డ్రైవర్ నిద్రమత్తే కారణమా? : ఈ నెల 24న గుంటూరులో బయలుదేరి బాలగంగాధర శర్మ కుటుంబ సభ్యులు శ్రీశైలం, మహానంది క్షేత్రాలను దర్శించుకున్నారు. అనంతరం బళ్లారి వెళ్లి బంధువుల ఇంట్లో వేడుకకు హాజరై తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం నుంచి వాహనం నడుపుతూ డ్రైవర్ అలసిపోవడం, నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.

సాయం చేసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్​- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - Two Dead in Road Accident

డివైడర్​ను ఢీకొట్టిన లారీ : పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి వద్ద సిమెంట్ లోడ్ లారీ బోల్తా పడింది. మాచర్ల నుంచి రేపల్లె వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. లారీ డ్రైవర్​కు గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్​ను ఆస్పత్రికి తరలించారు.

రైలు ప్రమాదంలో జబర్దస్త్‌ ఆర్టిస్ట్ మృతి - విషాదంలో బుల్లితెర - Jabardasth Actor DIED in ACCIDENT

Last Updated : Jun 27, 2024, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details