Thieves Robbery at House In kadapa : వైఎస్సార్ జిల్లాలో సుమారు 24 లక్షల మంది జనాభా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం 3 వేల మంది ఉన్నారు. ఈ మూడు వేల మంది పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలం చెందుతున్నారు. గడిచిన నెల రోజుల్లో జిల్లాల వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంటికి తాళం వేస్తే చాలు దొంగలు ఏకంగా తాళాలను సైతం పగలగొట్టి ఇళ్లలో చొరబడుతున్నారు. బీరువాలను పగలగొట్టి డబ్బులను బంగారు నగలను దోచుకెళ్తున్నారు.
ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న సొమ్ము దొంగల పాలవుతుంది. రాత్రి వేళల్లో చోరీలు జరగడం పరిపాటయితే ఏకంగా పట్టపగలు దొంగలు కొల్లగొట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఇటీవల కడప ప్రకాష్ నగర్లో తాళం వేసిన ఇంటిలో దొంగలు చొరబడి సుమారు నాలుగున్నర లక్షల రూపాయల నగదు పది తులాల బంగారాన్ని కొల్లగొట్టారు. అలానే రాజు పార్కుకి వెళ్లే దారిలో వరుసగా మూడు దుకాణాల పైకప్పులను తొలగించి దొంగలు దుకాణాల్లో ఉన్న సామగ్రిని నగదును దొంగలించారు. కడప ఓంశాంతి నగర్లో తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి మూడు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను దొంగలించారు.
కనిపెట్టారు - బైక్ నుంచి రూ.3.5 లక్షలు కొట్టేశారు - సీసీటీవీలో దృశ్యాలు - Theft Case in Uravakonda
గస్తీ ఎక్కడ?: ఇలా జిల్లా మొత్తం గత నెల రోజుల్లోనే సుమారు 10 నుంచి 15 భారీ దొంగతనాలు జరిగాయి. లక్షల రూపాయలు దొంగల పాలయ్యాయి. జిల్లాకు వచ్చిన కొత్త ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనదైన శైలిలో దొంగతనాలు నిర్మూలనకు కట్టుదిట్టమైన ప్రణాళికలు చేపడుతున్నప్పటికీ దొంగతనాలు జరగడం విడ్డూరంగా ఉంది. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. కానీ ఆ గస్తీ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి.