Thieves Looted Hundi in Lord Shiva Temple At Nirmal of Telangana :జల్సాలకు అలవాటు పడిన కొందరు దొంగతనాలు చేస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో వారికి గుడి, ఇల్లు అనే తేడా లేకుండా పోతోంది. ఎక్కడ పడితే అక్కడ చేతివాటం చూపిస్తున్నారు. చివరకు పోలీసులకు చిక్క ఊచలు లెక్కపెడుతున్నారు. ఇటువంటి ఘటనతెలంగాాణలోని నిర్మల్ జిల్లాలో జరిగింది.
కుబీర్ మండలంలోని రాజరాజేశ్వరుని ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి గర్భగుడి ముందు మండపంలో ఉన్న హుండీని గుర్తు తెలియని ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ తతంగమంతా మండపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రాజరాజేశ్వరుని ఆలయంలో పురుషుడు, ఓ మహిళ (Thieves)చొరబడ్డారు. గర్భగుడి ముందున్న హుండీలోని డబ్బులను తీసేందుకు ప్రయత్నాలు చేశారు. వారు ఎంత ప్రయత్నించినా హుండీ తెరుచుకోకపోవడంతో హుండీని బయటి దాకా పట్టుకొని వెళ్లి కారులోని వెనుక డిక్కీలో వేసి తీసుకెళ్తున్నారు. ఇంతలో దేవుడే హుండీని కాపాడుకున్నట్టుగా దొంగల కారు గుంతలో పడి ఒక్కసారిగా పంక్చర్ అయింది. దీంతో వారికి ఏం చేయాలో తోచలేదు. ఆ దొంగలు టైరు మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అప్పుడే అటువైపుగా కొందరు వ్యక్తులు వచ్చారు. వారిని చూసి భయపడిన దొంగలు కారును అక్కడే వదిలేసి పారిపోయారు.