Girls Missing In Hyderabad:స్నేహితులైన ఇద్దరు బాలికలు ఇంట్లో చెప్పకుండా బడి వదిలేసి మరీ బీచ్ బాట పట్టిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు సకాలంలో స్పందించడంతో కథ సుఖాంతమైంది.
బడికి అని బీచ్ కి వెళ్లి:కూకట్‌పల్లి బాలాజీనగర్, ఆల్విన్‌కాలనీలకు చెందిన ఇద్దరు బాలికలు ప్రైవేటు పాఠశాలలో 8వతరగతి చదువుతున్నారు. ఓ బాలిక సొంతూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ గురించి తరచూ చెప్తుండేది. తన తోటి స్నేహితురాలు అలా చెప్పేసరికి రెండో బాలికకూ బీచ్‌పై ఆసక్తి పెరిగింది. దాంతో ఇద్దరు కలిసి వెళ్లాలనుకుని నిశ్చయించుకున్నారు. రోజూ మాదిరిగానే ఓ బాలికను తల్లి బుధవారం పాఠశాల వద్ద దింపి వెళ్లిపోయింది. సాయంత్రం వచ్చేసరికి తన కుమార్తె, ఆమె స్నేహితురాలు కన్పించలేదు. ఎప్పటికీ రాకపోయేసరికి ఆందోళనతో రెండు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకుని పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ గుడి సమీపంలోని నిర్మాణ భవనంలోకి యూనిఫాంలో వెళ్లిన ఆ ఇద్దరూ సాధారణ దుస్తులతో బయటకు రావడం గమనించారు. వారి ‘ఇన్‌స్టాగ్రాం’ లొకేషన్ ఆధారంగా బాపట్ల వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందంతో బయలుదేరి బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు బాలికలను సూర్యలంక బీచ్ మార్గమధ్యంలో అడ్డగించి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. వారితో మాట్లాడిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ కె.శ్రీనివాసరావు, సీఐ కొత్తపల్లి ముత్తు వెల్లడించారు.
'టీడీపీ వేధింపులతోనే యువతి మృతి' - మిస్సింగ్ కేసులో వైసీపీ చీప్ ట్రిక్స్ - YCP Tricks in Woman Missing Case
యువతి అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు- పవన్ ఆదేశించిన 48గంటల్లో వీడిన మిస్టరీ - Woman Missing Case