ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలగిరుల్లో ఈ జలం సేవిస్తే జ్ఞానయోగం - శేషగిరుల్లో 66 కోట్ల తీర్థాలు, ఏడు ముక్తిప్రదాలు - tirumala tirupati - TIRUMALA TIRUPATI

tirumala tirupati : కోట్లాది మంది భక్తులు కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతం ముఖభాగాన్ని వేంకటాద్రి, మధ్యభాగాన్ని నృసింహాద్రి, వెనుక భాగాన్ని శ్రీశైలం అని పురాణాలు పురాణాలు అభివర్ణిస్తున్నాయి. ఈ శేషగిరులు అనేకానేక వృక్షసంపద, జీవసంపద, జంతుకోటికి ఆలవాలమే కాకుండా అనేకానేక పుణ్యతీర్థాలు కలిగి జలసంపదకు నిలయంగా ఉన్నాయి.

tirumala_tirupat
tirumala_tirupat (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 1:15 PM IST

Tirumala Tirupati :"పుణ్యతీర్థం" అంటే శుభం కలిగించే జలం అనే అర్థాన్నిస్తుంది. తిరుమల పర్వతశ్రేణుల్లో అలాంటి పుణ్యతీర్థాల సంఖ్య 66 కోట్లు అని బ్రహ్మపురాణం, స్కంధపురాణం ద్వారా తెలుస్తోంది. వీటన్నింటినీ ధర్మరతి, జ్ఞాన, భక్తి వైరాగ్య, ముక్తిప్రద అనే నాలుగు తీర్థాలుగా విభజించడమైంది. అందులో ప్రధానమైనవి తెలుసుకుందాం.

'తిరుమలలో అక్కడ స్నానం చేస్తే మోక్షప్రాప్తి'- 'శ్రీవారి కంటే ముందుగా ఆయనకే నైవేద్యం' - Adivaraha Kshetram

ధర్మరతిప్రద తీర్థములు...

పుణ్యతీర్థాల దగ్గర నివసించినా, జలం సేవించినా, స్నానం చేసినా ధర్మాసక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. తిరుమల గిరుల్లో ధర్మరతిప్రద తీర్థాల సంఖ్య 1008గా నిర్ణయించారు.

జ్ఞానప్రద తీర్థములు...

జ్ఞానప్రద తీర్థాల్లో నీటిని సేవిస్తే జ్ఞానయోగం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వీటి సంఖ్య 108 అవి.. 1.⁠మను తీర్థము 2. ఇంద్ర 3. వసు 4. రద్ర (11) 5. ఆదిత్య (12) 27. ప్రజాపతి (9) 36. అశ్విని 37. శుక్ర 38. వరుణ్‌ 39. జాహ్నవి 40. కాపేయ 41. కాణ్వ 42. ఆగ్నేయ 43. నారద 44. సోమ 45. భార్గవ 46. ధర్మ 47. యజ్ఞ 48. పశు 49. గణేశ్వర 50. భౌమాశ్వ 51. పారిభద్ర 52. జగజాడ్యహర 53. విశ్వకల్లోల 54. యమ 55. భారస్పత్య 56. కామహర్ష 57. అజామోద 58. జనేశ్వర 59. ఇష్టసిద్ధి 60. కర్మసిద్ధి 61. వట 62. జేదుంబర 63. కార్తికేయ 64. కుబ్జ 65. ప్రాచేతస (10) 75. గరుడ 76. శేష 77. వాసుకి 78. విష్ణువర్థన 79. కర్మకాండ 80. పుణ్యవృద్ధి 81. ఋణవిమోచన 82. పార్జన్య 83. మేఘ 84. సాంకర్షణ 85. వాసుదేవ 86. నారాయణ 87. దేవ 88. యక్ష 89. కాల 90. గోముఖ 91. ప్రాద్యుమ్న 92. అనిరుద్ధ 93. పిత్రు 94. ఆర్షేయ 95. వైశ్వదేవ 96. స్వధా 97. స్వాహా 98. అస్థి 99. ఆంజనేయ 100. శుద్ధోదక 101. అష్ట భైరవ (8).

భక్తి వైరాగ్యప్రద తీర్థములు...

ఇవి జ్ఞానపద తీర్థములకన్నా శ్రేష్టమైనవి. ఈ తీర్థములను తీసుకుంటే పాపపరిహారం, సంసార వైరాగ్యం, దైవభక్తి ప్రాప్తిస్తుందని ప్రశస్తి. ఇవి మొత్తం 68 తీర్థములు. అవి 1.⁠ చక్ర 2. వజ్ర 3. విష్వక్సేన 4. పంచాయుధ 5. హాలాయుధ 6. నారసింహ 7. కాశ్యప 8. మాన్మధ 9. బ్రహ్మ 10. అగ్ని 11. గౌతమి 12. దైవ 13. దేవం 14. విశ్వామిత్ర 15. భార్గవ 16. అష్టవక్ర 17. దురారోహణ 18. భైరవ, (పిశాచవిమోచనము) 19. మేహ (ఉదరవ్యాధి నాశనం) 20. పాండవ 21. వాయు 22. అస్థి (పునరుజ్జీవన సాధనము) 23. మార్కండేయు (ఆయువృద్ధి) 24. జాబాలి 25. వాలభిల్య 26. జ్వరహర (సర్వజ్వరనాశనం) 27.విషహర (తక్షక విషవ్యాధి నివారకం) 28. లక్ష్మి 29. ఋషి 30. శతానంద 31. సుతీక్షక 32. వైభాండక 33. బిల్వ 34. విష్ణు 35. శర్వ 36. శారభ 37 బ్రహ్మ 38. ఇంద్ర 39. భారద్వాజ 40. ఆకాశగంగ 41 ప్రాచేతస 42. పాపవినాశన 43. సారస్వత 44. కుమారధార 45. గజ 46. ఋశ్యశృంగ 47. తుంబురు 48. థావతారం(10) 58. హలాయుధ 59. సప్తర్షి(7) 66. గజకోణ 67. విశ్వక్సేన 68. యుద్ధసరస్థీ (జయప్రదాయకం).

ముక్తిప్రదములు...

సర్వమానవకోటికి ముక్తి సాధనం కూర్చేవి ఈ తీర్థములే. ఇవి సర్వోత్కృష్టమైనవి. ఇవి మొత్తం ఏడు. అవి..

1.⁠⁠శ్రీస్వామి పుష్కరిణి 2. కుమారధార 3. తుంబురు 4. రామకృష్ణ 5. ఆకాశగంగ 6. పాపవినాశనం 7. పాండవ తీర్థం. దీనికి గోగర్భమనే పేరు కూడా ఉంది.

శ్రీవారి ఆలయానికి ఈశాన్యదిశలో ఉండే శ్రీస్వామి వారి పుష్కరిణి సర్వోత్కృష్టమైనదిగా, తీర్థరాజంగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా శ్రీవారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో, రధసప్తమి తదితర సందర్భాల్లో ఈ తీర్థస్నానం శుభదాయకమని తెలుస్తోంది. ధనుర్మాసంలో శుద్ధ ద్వాదశి సూర్యోదయంలో ఆరుఘడియల కాలం సర్వోత్తమమైనదిగా పురాణ ప్రశస్తి.

2. ⁠⁠కుమారధార : కుంభమాసంలో మఖానక్షత్రంతో కూడిన పౌర్ణమి పర్వదినం.

3.⁠ తుంబురు : మీన మాసమందు ఉత్తర పాల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి అపరోహ్ణకాలం శుభదినం.

4.⁠ రామకృష్ణ : మకరమాస పుష్యమి నక్షత్రాయుత పౌర్ణమి.

5.⁠ కాశగంగ : మేషమాస చిత్రానక్షత్రాయుత పౌర్ణమి.

6. పాపవినాశనం : ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షమున ఉత్తరాఢ నక్షత్రాయుత సప్తమి ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాయుత ద్వాదశి.

7. పాండవ (గోగర్భం) : వృషభమాసంలో శుద్ధ ద్వాదశి ఆదివారము లేదా బహుళ ద్వాదశి మంగళవారం ఉభయయాత్ర సంగమకాలం పర్వకాలము. సంగమకాలం అంటే ఉదయం 6 ఘడియల నుంచి 12 ఘడియల వరకు.

ఈ తీర్థాలలో శ్రీస్వామి పుష్కరిణి, కుమాధార, తుంబురు, రామకృష్ణ తీర్థాలకు ప్రతి సంవత్సరం ముక్కోటి కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

తిరుమల ప్రసాదం వడ నుంచి లడ్డూగా ఎలా మారిందంటే? - శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా? - Tirumala Laddu History in Telugu

సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి- తిరుమలలో వైభవంగా గరుడ పంచమి సేవ - Garuda Panchami Seva in Tirumala

ABOUT THE AUTHOR

...view details