TG Minister Komatireddy Venkat Reddy About Movie Benefit Shows :సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదలకు ముందురోజు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇకనుంచి టికెట్ల రేట్ల పెంపునకూ అనుమతి ఇచ్చేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పరిహారమిస్తానన్న హామీని అల్లు అర్జున్ నిలబెట్టుకోలేదన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ నుంచి రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తామని తెలిపారు. శ్రీతేజ్ చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగాహైదరాబాద్లోనిసంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, బాలుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు సినీ హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా హైకోర్టు ఈ నెల 27 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇదే ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చలు జరిగాయి. చర్చ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా చూసి వెళ్లిపోతే సరిపోయేది - హంగామా వల్లే ఇదంతా: రేవంత్‌రెడ్డి