ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల - Telangana Inter Results Release - TELANGANA INTER RESULTS RELEASE

Telangana Intermediate Results Soon: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మిడియట్‌ ఫలితాలు విడుదల కావటంతో తెలంగాణ ఇంటర్‌ ఫలితాల విడుదలపై విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకుంది. ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది విద్యార్ధులు హైదరాబాద్‌లో ఇంటర్మిడియట్‌ విద్యను అభ్యసించి అక్కడే పరీక్షలకు హాజరయ్యారు. దీంతో తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఇంటర్మిడియట్‌ ఫలితాల విడుదల కూడా అతిత్వరలో ఉంటుందని అక్కడి విద్యాశాఖ ఈటీవీ భారత్‌ ప్రతినిధికి తెలిపారు. ఏప్రిల్‌ 20 నుంచి 25లోపు ఎట్టిపరిస్థితుల్లోనూ ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 4:09 PM IST

Updated : Apr 15, 2024, 9:34 AM IST

Telangana Inter Results Release :ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మన రాష్ట్రం కంటే ముందే తెలంగాణలో పరీక్షలు పూర్తి అయినా విడుదల కొంత ఆలస్యమైంది. దీంతో అక్కడి ఫలితాలు ఎప్పుడు వస్తాయని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు.

ఏప్రిల్‌ 22లోపు :

ఏప్రిల్‌ 22లోపు ఒకేసారి మొదటి, ద్వితీయ సంవత్సరం ఇంటర్మిడియట్‌ రిజల్ట్‌ ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందుకు అవసరమైన అన్ని ముందస్తు కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ఫలితాల విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈటీవీ భారత్‌ ప్రతినిధి ఇంటర్మిడియట్‌ అధికారులను పరీక్ష ఫలితాల విడుదలపై సంప్రదించారు. ఈ నెల 21 లేదా 22 తేదీలలో ఇంటర్ ఫలితాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు ఆయన తెలిపారు. ఏదైనా అనివార్య పరిస్థితులు ఉత్ఫన్నమైనా 25లోపు ఫలితాలు వస్తాయన్నారు.

సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా :

తెలంగాణ ఇంటర్మిడియట్‌ పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేసిమరీ.. ఎంతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాదికి సంబంధించి సంబంధించి 9 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్మిడియట్‌ పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరంతా కూడా పరీక్ష ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈఏడాది మూల్యాంకన ప్రక్రియను మార్చి 10నే ప్రారంభించి దాదాపు 20రోజుల్లోనే పూర్తి చేశారు. మార్కుల నమోదు ప్రక్రియను కూడా ముగించారు. కానీ పరీక్షకు హాజరు కాని విద్యార్ధులు, వివిధ కారాణాలతో పరీక్షలకు హాజరైనా పూర్తి చేయని వారి వివరాలను ప్రస్తుతం కంప్యూటీకరణ చేస్తున్నారు. అలాగే ఫలితాల విడుదలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, సాంకేతికపరమైన ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఫలితాల విడుదల దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్‌ అమల్లోఉంది. కొందరు అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో ఫలితాల విడుదల కొంత ఆలస్యమైంది.

తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మిడియట్‌ ఉత్తీర్ణత :

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాల్లో ఈ ఏడాది విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 67 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ సౌరబ్‌గౌర్‌, పరీక్షల కంట్రోలర్‌ సుబ్బారావు తెలిపారు. ఫలితాల్లో ప్రతి ఏడాది మాదిరి ఈ సంవత్సరం కూడా బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో కూడా బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్‌ ఇయర్‌లో ఫలితాల్లో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఉత్తీర్ణత తగ్గడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి చదవండి : ఏపీ ఇంటర్​ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్​ చూసుకోండిలా

ఇంటర్ ఫలితాల విడుదల- ప్రత్యక్షప్రసారం

Last Updated : Apr 15, 2024, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details