HC Granted Bail To Raj Tarun : యువ సినీ హీరో రాజ్‌తరుణ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అతడికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనని మోసం చేశాడంటూ కొద్ది రోజుల క్రితం లావణ్య అనే యువతి రాజ్‌తరుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి విధితమే. తామిద్దరం కొన్నేళ్ల పాటు సహజీవనం చేశామని, ఆ తర్వాత రహస్య వివాహం చేసుకున్నామని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు వేరే మహిళతో సన్నిహితంగా ఉంటూ తనని పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసింది.
హీరో రాజ్‌తరుణ్‌కు ఊరట - షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు - Anticipatory Bail to Raj Tarun - ANTICIPATORY BAIL TO RAJ TARUN
HC Granted Bail To Raj Tarun : హీరో రాజ్‌తరుణ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 8, 2024, 5:58 PM IST
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు :లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్‌తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాల్సిందిగా అతడికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్(యాంటిసిపేటరీ బెయిల్) మంజూరు చేయాలని కోరారు. దీంతో న్యాయస్థానం రాజ్‌తరుణ్‌కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే రూ.20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని అతడిని ఆదేశించింది.