ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ టెట్​ అభ్యర్థులకు గుడ్​ న్యూస్ - వారు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు - TELANGANA TET FEE

టెట్‌ పరీక్ష ఫీజును తగ్గించిన ప్రభుత్వం - ఒక పేపరు రూ.1000గా ఉన్న ఫీజును రూ.750కి తగ్గింపు -రెండు పేపర్లకు ఫీజు రూ.1000 మాత్రమే

Telangana Government Reduces Of TET Exam Fees
Telangana Government Reduces Of TET Exam Fees (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 3:05 PM IST

Telangana Government Reduces Of TET Exam Fees : తెలంగాణలో టెట్​ పరీక్షకు దరఖాస్తు చేసుకునేవారికి గుడ్​న్యూస్​. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)​ పరీక్ష ఫీజును ఆ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. టెట్​ ఒక పేపరుకు(పేపర్​-1 లేదా పేపర్​-2) రూ.1000గా ఉన్న ఫీజును 750 రూపాయలకు తగ్గించింది. రెండు పేపర్లకు రూ.2వేలుగా ఉన్న పరీక్ష ఫీజును రూ.1000 తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల మే నెలలో టెట్​ ఎగ్జామ్ రాసి అర్హత సాధించని వారికి ఫీజునుంచి మినహాయింపునిచ్చింది.

గురువారం రాత్రి 11 గంటల నుంచి టెట్​ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సాంకేతిక కారణాల వల్ల నవంబర్​ 5న ప్రారంభం కావాల్సిన ప్రక్రియ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవ్వగా పరీక్ష ఫీజును తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నిరుపేద, మధ్య తరగతి టెట్​ అభ్యర్థులకు మేలు జరగనుంది.

మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా- మరో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్​ వివరాలు

Telangana TET Updates :తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అఫీషియల్​ వెబ్​సైట్​లో మరింత సమాచారం ఉంటుంది. ఏవైనా సందేహాలుంటే అందులో చెక్‌ చేసుకోవచ్చు. ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన అక్కడి కాంగ్రెస్​ ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ఇంతకు ముందే తెలిపిన విషయం విధితమే. ఇప్పటికే మే నెలలో ఒకసారి టెట్ పరీక్షను నిర్వహించగా మరో మారు నోటిఫికేషన్ విడుదల చేయటంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఆరు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించగా జనవరిలో జరిగేది 7సారి కానుంది.

టెట్‌ పరీక్షకు అర్హత :టెట్‌ ఎగ్జామ్​ పేపర్‌-1కు డీఈడీ, పేపర్‌-2కు బీఈడీ​ పూర్తి చేసిన వారు అర్హులవుతారు. స్కూల్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్(పదోన్నతి) పొందేందుకు టెట్‌ అర్హత ఉండాలని చెబుతుండటం వల్ల వేల మంది ఇన్‌ సర్వీస్‌ టీచర్లు కూడా ఎగ్జామ్ రాయనున్నారు. టెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 9 సార్లు పరీక్షలు పెట్టగా జనవరిలో 10వ సారి జరగనుంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావించిన తర్వాత గతేడాది మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం గమనార్హం.

టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సమయమివ్వాలని ప్రభుత్వం నిర్ణయం- త్వరలో కొత్త తేదీలు ప్రకటన - TET and DSC Exams

విమర్శలకు తావులేకుండా మెగా డీఎస్సీ నిర్వహించాలి - అధికారులను ఆదేశించిన మంత్రి లోకేశ్ - Nara Lokesh Review With Officials

ABOUT THE AUTHOR

...view details