ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రం ప్రగతి బాటలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాలి'- ఎన్నికల ప్రచారంలో కూటమి జోరు - TDP Leaders Election Campaign in AP - TDP LEADERS ELECTION CAMPAIGN IN AP

TDP Leaders Election Campaign in AP : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచార జోరును పెంచారు. ఇంటింటికీ వెళ్లి సూపర్​ సిక్స్​ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

election_campaign
election_campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 7:37 AM IST

TDP Leaders Election Campaign in AP : కూటమి అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. రాష్ట్రం ప్రగతి బాటలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రజలకు వివరిస్తున్నారు.

NTR District :ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న టీడీపీ ఎంపీ అభ్యర్తి కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంటు పరిధిలో 7 స్థానాలనూ గెలిచి చంద్రబాబుకి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.

'స్టీల్​ ఫ్యాక్టరీ పరిరక్షిస్తాం- షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం' ఎన్నికల ప్రచారంలో కూటమి జోరు - Election Campaign In AP

West Godavari :పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ బీసీ సెల్ కన్వీనర్ కట్ట వెంకటరావు ఉండి కూటమి అభ్యర్థి మంతెన రామరాజు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్‌ను గెలిపించాలని తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి భరత్ , దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీ కృష్ణ కలిసి ప్రచారం నిర్వహించారు. విశాఖ రైల్వే న్యూ కాలనీలో ఇంటింటి ప్రచారం చేస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Bapatla :బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని పత్తేపురంలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చీరాల మండలం ఈపురుపాలెంలో టీడీపీ అభ్యర్థి కొండయ్య ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలోని పలుకూరు నుంచి తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిచారు. తెలుగుదేశం కనిగిరి అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ సీనియర్ నాయకుడు కుందురు తిరుపతిరెడ్డి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు 170 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి.

ర్యాలీలు, రోడ్​షోలు, సమావేశాలతో ఎన్నికల ప్రచారం - గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల వ్యూహం - AP Election Campaign

Anantapur District :కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. పాణ్యం నియెజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గౌరు చరితారెడ్డి, నంద్యాల తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి కర్నూలులోని 19వ వార్డు లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీలో చేరారు. కర్నూలులో తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. డోన్ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి బేతంచర్ల మండలంలోని ముసలాయిచెరువు, ముద్దవరం గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. తండ్రికి మద్దతుగా ప్యాపిలిలో కోట్ల కుమారుడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నంద్యాల తెలుగుదేశం అభ్యర్థి ఎన్​ఎండీ ఫరూక్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశంలో చేరారు.

రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్ అజెండా : లోకేశ్​ - Lokesh Election Campaign

ABOUT THE AUTHOR

...view details