TDP Leaders Complain to SP Against Vidadala Rajini:అక్రమ కేసులతో వేధించారని వైఎస్సార్సీపీ మాజీ మంత్రి విడదల రజినిపై పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు చిలకలూరిపేట ఐటీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు రామకృష్ణ, జయ ఫణీంద్ర కుమార్, గతంలో చిలకలూరిపేట అర్బన్ సీఐగా విధులు నిర్వహించిన సూర్యనారాయణపైనా ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక, మార్ఫింగ్ పోస్టులు పెట్టామని తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు స్టేషన్‌లో తమను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని వాపోయారు. చిత్రహింసలు పెడుతూ వాట్సప్ కాల్‌లో మాజీ మంత్రి విడదల రజిని, ఆమె వ్యక్తిగత సహాయకులకు చూపిస్తూ కొట్టారని ఆరోపించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసి చిలకలూరిపేట ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.