TDP Leader Palla Srinivas Fires On YSRCP Govt :నారా లోకేష్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిర్వహించిన శంఖారావం కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ టీడీపీ (TDP) కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుర్చీ మడతపెట్టి జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలన సమయం స్వర్ణయుగమైతే, జగన్మోహన్ రెడ్డి పాలన కాలం రాతియుగం అని అభివర్ణించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఈనాడు కార్యాలయం పై, ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడులు చేయడం దారుణమని ఆయన అన్నారు.
కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: పల్లా శ్రీనివాసరావు
వివేకానంద రెడ్డి హత్య జరిగితే చంద్రబాబుపై ఘోరంగా 'సాక్షి'లో రాతలు రాశారని, వైఎస్సార్సీపీ (YSRCP) లాగా ఆనాడు తాము స్పందిస్తే, పరిస్థితి ఎలా ఉండేదని ఆయన ప్రశ్నించారు. చినబాబు చిరుతిండ్లకు కోట్లు ఖర్చు అని జగన్ మీడియాలో అసత్యాలు రాశారని, అప్పుడు కోర్టును ఆశ్రయించారు కానీ, దాడులకు దిగలేదని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జి మాట్లాడారు.
విశాఖ ఉక్కు కోసం.. పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నించట్లేదు?: తెదేపా నేత పల్లా