Tataiahgunta Gangamma Jatara Celebrations Tirupati : తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వరుని సోదరిగా పూజలందుకుంటున్న తిరుపతి గంగమ్మ జాతరను ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మెుదటి రోజు భక్తులు బైరాగి వేషధారణతో గంగమ్మకు మెుక్కులు చెల్లించుకున్నారు. తాతయ్యగుంటలో వెలిసిన గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భక్తులంతా బైరాగి వేషంలో అమ్మవారికి పూజలు నర్వహించారు.
పాలెగాళ్ల అరాచకాలను అంతమొందిచేందుకు ఉద్భవించిన దేవతగా కలియుగ దైవం తిరుమల శ్రీవారి సహోదరిగా పూజలు అందుకుంటున్న తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని తాతయ్యగుంటలో వెలసిన గంగమ్మకు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏడు కొండల వెంకన్నకు ఆడపడుచుగా భావిస్తూ భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు.
Gangamma Jatara Celebrations in Annamayya District :అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. వివిధ వేషధారణలు, డప్పుల చప్పుళ్లు, టపాసులు మోతలతో జాతర ఉత్సాహంగా సాగుతోంది. గంగమ్మ తల్లికి మొక్కితే కోరిన కోర్కెలు తీరతాయని ప్రజల విశ్వాసం. జాతర సందర్భంగా పట్టణ ప్రజలతో పాటుచుట్టుపక్కల గ్రామ నుంచి పెద్దఎత్తున జనం తరలివచ్చారు.