Suspicious death in Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరులో హుస్సేన్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యం కేసులో హుస్సేన్‌ను అనుమానితుడిగా భావించి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ క్రమంలో హుస్సేన్ మృతి చెందాడు. మూడు రోజుల నుంచి సీసీఎస్ పోలీసులు హుస్సేన్‌ను విచారిస్తున్నారు. లాకప్ డెత్ అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుస్సేన్ మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసు - విచారణ క్రమంలో వ్యక్తి మృతి! - Suspicious death in Nandikotkur - SUSPICIOUS DEATH IN NANDIKOTKUR
Suspicious death in Nandikotkur: ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న హుస్సేన్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మూడు రోజుల నుంచి పోలీసులు విచారిస్తున్నారు. హుస్సేన్ మృతి లాకప్ డెత్ అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Suspicious death in Nandikotkur (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 20, 2024, 2:09 PM IST