SC Refuses to Interim Bail to Nandigam Suresh: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నందిగం సురేష్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ అరెస్టయ్యారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సురేష్ పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. నందిగం సురేష్‌కు బెయిలిచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. నందిగం సురేష్ పిటిషన్‌పై తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది.
నందిగం సురేష్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ - SC ON NANDIGAM SURESH INTERIM BAIL
నందిగం సురేష్ పిటిషన్‌పై తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా
![నందిగం సురేష్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ Nandigam_Suresh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-12-2024/1200-675-23157554-thumbnail-16x9-nandigam-suresh.jpg)
Nandigam Suresh (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2024, 2:00 PM IST