Students Get Emotional While Teacher Retirement in Ramabhadrapuram :ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య ఉండే అనుబంధమే వేరు. తల్లిదండ్రుల తర్వాత వారి గురించి బాగా తెలిసిన వాళ్లు టీచర్లే. వాళ్లకేం కావాలి, వారు ఏం చెయ్యగలుగుతారు, ఎలా తీర్చిదిద్దాలని ప్రతి నిత్యం కృషి చేస్తారు. అలాంటి వారితో పిల్లలు చాలా కనెక్ట్ అవుతారు. ప్రతీ వ్యక్తికి విద్యార్థి దశలో ఓ గురువు మార్గదర్శకంగా ఉంటారు, అలాగే ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు. వారిని జీవితాంతం మర్చిపోలేరు.
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పాఠశాల విడిచి వెళ్తున్న టీచర్‌ను వెళ్లొద్దంటూ విజయనగరం జిల్లా రామభద్రపురంలో విద్యార్థులు బోరున విలపించారు. విద్యార్థులను సముదాయించలేక ఉపాధ్యాయురాలు కన్నీరుపెట్టారు. రామభద్రపురంలోని పూడివీధి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయగౌరి వచ్చే మార్చిలో జరిగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఇందుకోసం ఆమె వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.