ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగాళాఖాతంలో పొంచి ఉన్న తుపానులు! - నవంబరు వరకు రాష్ట్రానికి గడ్డుకాలం - Storms in the Bay of Bengal - STORMS IN THE BAY OF BENGAL

Storms in the Bay of Bengal in October: ప్రతి సంవత్సరం అక్టోబరులో ఏపీకి తుపానుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గతంలో ఈ నెలలో వచ్చిన తుపానులు ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా మిగిల్చాయి. అందుకే అక్టోబర్​ ఈ నెల పేరు వింటేనే రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా వారిలో ఆందోళన మొదలవుతుంది.

Storms in the Bay of Bengal in October
Storms in the Bay of Bengal in October (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2024, 11:30 AM IST

Storms in the Bay of Bengal in October :అక్టోబర్​ ఈ నెల పేరు వింటేనే రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా వారిలో ఆందోళన మొదలవుతుంది. చిన్నపాటి గాలి వీచినా రైతులు అల్లాడిపోతారు. పైలిన్‌, హుద్‌ హుద్‌, అంపన్‌ ఇలా పేరేదైనా, ఎక్కడ తీరం దాటినా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో విపత్తులు పొంచి ఉంటాయి. ఈ నెలలో వచ్చిన తుపానులు ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా మిగిల్చాయి.

ఏపీకి 480 కిలోమీటర్లు తీరం :ప్రతి సంవత్సరం అక్టోబరులో ఏపీకి తుపానుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు సెప్టెంబరు నెలాఖరులో వెనక్కి మళ్లుతాయి. ఈశాన్య రుతుపవనాలు పుంజుకుంటాయి. ఈ సమయంలో అండమాన్‌ సముద్రంలో అల్ప పీడనాలు ఏర్పడడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి. క్రమేణా వాయు గుండాలు తుపానులుగా మారతాయి. ఈ విపత్తులన్నీ ఏపీ లేదా ఒడిశా తీరాలు దాటి ప్రళయం సృష్టిస్తాయి. ప్రాణ, ఆస్తి నష్టం మిగులుస్తున్నాయి. గంజాం, ఖుర్దా, కేంద్రపడ, పూరీ, భద్రక్‌, జగత్సింగ్‌పూర్‌, బాలేశ్వర్‌ జిల్లాలు తీరానికి చేరువగా ఉన్నాయి. తుపానుల ముప్పు వీటికి ఎక్కువ. ఏపీకి 480 కిలోమీటర్లు తీరం ఉంది.

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం- అక్టోబర్​, డిసెంబర్​లో కూడా వర్షాలు పడతాయ్! : IMD

30 వేల మంది మృతి! :1999 అక్టోబరు 18న గోపాలపూర్‌, 29న జగత్సింగ్‌పూర్‌ జిల్లా ఎరసమ వద్ద తీరాలు దాటిన తుపానులు ప్రాణ, ఆస్తి నష్టాలు మిగిల్చాయి. పరదీప్‌కు చేరువలో ఎరసమ వద్ద తాకిన ప్రచండ తుపాను, ఉప్పెనల వల్ల పది వేల మంది అధికారికంగా మృతి చెందారు. అనధికారికంగా మృతుల సంఖ్య 30 వేలు ఉంటుందని అంచనా. లక్షల్లో వన్య ప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. ఉత్తర కోస్తాలోని 14 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఉప్పెనలో ముప్పై ఊళ్లు తుడిచి పెట్టుకుపోయాయి.

ఒడిశాలో తీరం దాటే అవకాశాలు :ప్రముఖ ఐఎండీ పూర్వ శాస్త్రవేత్త డాక్టర్‌ శరత్‌చంద్ర సాహు మాట్లాడుతూ అక్టోబరు ప్రథమార్ధం నుంచి నవంబరు నెలాఖరు వరకు అండమాన్‌లో ఏర్పడే పీడనాలు తుపానులుగా బలం పుంజుకోవడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయని అన్నారు. ఇవి ఒడిశాలో తీరం అతిక్రమించడానికి అవకాశాలు ఎక్కువని తెలిపారు. గోపాలపూర్‌, మహాళపడ, పరదీప్‌ తీరాలు అనుకూలమని, విపత్తులపై ముందస్తుగా కొన్ని విదేశీ మెట్‌ సంస్థలు అంచనా వేస్తున్నా కచ్చితమైన అధ్యయనం ఐఎండీ మాత్రమే చేయగలదని, ఇది నిరూపితమైందని అన్నారు. కేంద్ర ఎర్త్‌ సైన్స్‌ శాఖ (Central Department of Earth Science) రాడార్‌ కేంద్రాలకు అవసరమవుతున్న యంత్ర సామగ్రి సమకూరుస్తోందని వెల్లిడించారు.

వాయుగుండంతో గాలి వేగం :స్థానిక ఐఎండీ కేంద్రం అధికారి ఉమాశంకర్‌ దాస్‌ (Umashankar Das) సోమవారం 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ బంగాళాఖాతం ఉపరితలంలో గాలి తీవ్రత సాధారణంగా 25 కిలోమీటర్లుగా ఉంటుందని అన్నారు. అల్పపీడనాలు ఏర్పడితే వేగం 35 నుంచి 45 కి.మీ.కు పెరుగుతుందన్నారు. పీడనాలు వాయుగుండాలుగా మారితే గాలి తీవ్రత 50 నుంచి 60 కిలోమీటర్లకు పెరుగుతుందని, తీరంవైపునకు పెనుగాలులు వీస్తాయన్నారు. వాయుగుండంతో గాలి వేగం 74 కిలోమీటర్లు దాటితే తుపానుగా మారుతాయన్నారు. ఇది 125 నుంచి 164 కిలోమీటర్లకు పెరిగితే 'సివియర్‌' సైక్లోన్‌గా ప్రకటిస్తామన్నారు.

బంగాళాఖాతం ఉగ్రరూపం! - ఈ నైరుతిలో ఎనిమిది అల్పపీడనాలు - Review on Rains and Ocean Situation

165 నుంచి 224 కిలోమీటర్లు గాలి వేగం ఉంటే 'వెరీ సివియర్‌'గా పరిగణిస్తామని అన్నారు. 225 నుంచి 279 కిలోమీటర్ల తీవ్రత ఉంటే 'సూపర్‌ సైక్లోన్‌'గా ప్రకటిస్తామన్నారు. తుపానుల తీవ్రత అంచనా వేసి ఓడరేవులకు హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. 1 నుంచి 3 వరకు సాధారణం కాగా 10వ ప్రమాద హెచ్చరిక విధ్వంసానికి సూచికని తెలిపారు. ఈ విపత్తుల వల్ల ఆయా ప్రాంతాల్లో ఎన్ని సెంటీమీటర్ల వాన కురుస్తుంది. భూమి కోతలకు అవకాశం ఉందా అన్నది చెప్పగలుగుతున్నామన్నారు. తుపానుల గురించి ప్రతి గంటకు విపత్తు నివారణ శాఖకు, ప్రసార సాధనాలకు తెలియపరుస్తున్నామని తెలిపారు.

మరో పది ఓడ్రాఫ్‌ దళాలు ఏర్పాటు :తుపానుల రాకపోకలను ముందుగా తెలుసుకోగలిగితే ప్రాణ నష్టం నివారించవచ్ఛు. వరుస విపత్తులను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇటీవల ముందస్తు చర్యలు చేపట్టాయి. అత్యాధునిక సాధనా సంపత్తి వినియోగంలోకి వచ్చాయి. ఈ క్రమంలో తూర్పు తీరంలో కీలకమైన గోపాలపూర్‌, పరదీప్‌లలో అత్యాధునిక డాప్లార్‌ రాడార్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇస్రో సాంకేతిక పరిజ్ఞానం గల గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అత్యంత శక్తివంతమైనది.

500 కిలోమీటర్ల పరిధిలో సముద్రంలో జరిగే పరిణామాలన్నీ తెలియజేసే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. సమీప భవిష్యత్తులో బాలేశ్వర్‌, సంబల్‌పూర్‌లలో మరో 2 ఐఎండీ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఇవి రైతుల సమాచారం కోసం ప్రత్యేకం. ప్రభుత్వ విపత్తులను సమర్ధంగా ఎదుర్కోవడానికి ఇరవై ఓడ్రాఫ్‌ దళాలు, 864 ఆశ్రయ కేంద్రాలు నిర్మించింది. సహాయ కార్యక్రమాలకు అవసరమైన సాధనా సంపత్తి సమకూర్చుతుంది. దీంతో ప్రాణ నష్టం తగ్గింది. విపత్తుల నివారణలో ఒడిశా అగ్రగామిగా నిలిచింది. త్వరలో మరో పది ఓడ్రాఫ్‌ దళాలు ఏర్పాటు కానున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్‌లో కేటాయింపులూ జరిగాయి.

తుపానుల వల్ల నష్టాలు ఇలా :

  • 2013 అక్టోబరు 12న గోపాలపూర్‌ వద్ద తీరం దాటిన పైలిన్‌ తుపానుతో రూ.14 వేల కోట్లు
  • 2014లో విశాఖ వద్ద విలయం సృష్టించిన హుద్‌హుద్‌ రూ.4,949 కోట్లు
  • 2018లో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం, వజ్రపుకొత్తూరు చేరువలో తీరం దాటిన 'తిత్లీ' రూ.2779 కోట్లు
  • 2019లో పూరీ వద్ద తీరం దాటిన 'ఫొని' రూ.9,336 కోట్లు
  • 2019లో 'బుల్‌బుల్‌' రూ.224.43కోట్లు
  • 2020లో అంపాన్‌ వల్ల రూ.236.68 కోట్లు
  • 2020లో 'యాస్‌' తుపాను రూ. 823.49 కోట్లు 'గులాబ్‌' వల్ల రూ.34.21 కోట్లు
  • 2021లో 'జవాబ్‌' తుపాను వల్ల రూ.376.51 కోట్లు

60 ఏళ్లలో చూడని ప్రళయం - వర్షం ధాటికి కొండలు కరిగి ఊర్లనే మింగేసింది - Tribes Problems on Rains

ABOUT THE AUTHOR

...view details