State Police Implemented LHMS APP for Curb Theft : దొంగతనాలను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసుశాఖ 2017లో ఎంతో ప్రతిష్టాత్మకంగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్(LHMS)ను ప్రారంభించ. సాంకేతికతతో నేరాలు అదుపు చేసేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోంది. కానీ ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ తక్కువ మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవుల నేపథ్యంలో ఎల్‌హెచ్‌ఎంఎస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. ఇటీవల కాలంలో ఇంటి దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని వినియోగించుకోవడం ద్వారా చోరీలను అదుపుచేయవచ్చని పోలీసులు చెబుతున్నారు.
వినియోగం ఇలా : గూగుల్ స్టోర్ నుంచి ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్ నంబరు, చిరునామాతో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తవగానే వచ్చే ఐడీ భద్రపరుచుకోవాలి. ఊరు వెళ్లాల్సిన సందర్భంలో యాప్‌లోకి వెళ్లి యూజర్ ఐడీ నమోదు చేసి వెళ్లే, తిరిగి వచ్చే సమయాలను టైప్ చేసి రిక్వెస్ట్ పోలీసు వాచ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. సమాచారం అందుకున్న కంట్రోల్ రూం పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో వచ్చిన చిరునామాలో వైఫై రూటర్, సెన్సార్‌తో పనిచేసే మోషన్ కెమెరాలు, విద్యుత్తు పోయినా పనిచేసేలా యూపీఎస్ ఏర్పాటుచేసి, కంట్రోల్ రూమ్‌కి అనుసంధానిస్తారు.
ఇంకా బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదా? - అయితే ఇలా అప్లై చేసుకోండి! - how to get BIRTH CERTIFICATE