State Civil Supplies Minister Nadendla Manohar Tweet : ధాన్యం కొనుగోళ్లపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. 'రైతుకి ఎవరు అండగా నిలబడ్డారో ఒకసారి చూడండి' అంటూ కొనుగోళ్ల పట్టికను తన పోస్టింగ్‌కు జోడించారు. మీ చేతగాని పాలనలో ఈ సమయానికి- కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని ధ్వజమెత్తారు. బాధ్యత కలిగిన మా కూటమి ప్రభుత్వం 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని పేర్కొన్నారు.
48 గంటలలోపే తాము డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. జగన్ పాలనలో ఏ రోజైనా రైతులకి సక్రమంగా డబ్బులు చెల్లించారా? అని ప్రశ్నించారు. కనీసం గోతాలు కూడా సరిపడా ఇవ్వలేకపోయారని మండిపడిన మనోహర్- రైతులను దగా చేసిన మీకు ర్యాలీలు చేసే అర్హత ఉందా? అని నిలదీశారు.