ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందులలో జగన్‌ ప్రజా దర్బార్ - తోపులాటలో పగిలిపోయిన అద్దాలు - YS JAGAN PRAJA DARBAR PROGRAM

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో తోపులాట - జగన్ రాక ముందే కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు

YS_Jagan_Praja_Darbar_Program
YS_Jagan_Praja_Darbar_Program (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2024, 4:50 PM IST

Stampede at Jagan Praja Darbar Program:వైఎస్సార్ జిల్లా పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో తోపులాట జరిగింది. 3వ రోజు పర్యటనలో భాగంగా జగన్ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జగన్ రావడానికి ముందే క్యాంపు కార్యాలయానికి ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు వినతులు ఇవ్వడానికి తరలివచ్చారు. జగన్ రాగానే అందరూ ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ సమయంలోనే వారిని పోలీసులు అదుపు చేయలేకపోయారు. అందరూ ఒక్కసారిగా వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో కార్యాలయం అద్దాలు పగిలిపోయాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారందరిని చెదరగొట్టి పంపించారు. వినతులు ఇవ్వటానికి వచ్చినవారు క్యూ లైన్​లో ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కాగా క్యాంపు కార్యాలయం వద్ద జగన్ నిర్వహించే ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ఘటనలు జరుగడం చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details