ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భవితకు దిక్సూచిలా 'అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌' - నిపుణుల హర్షం

డ్రోన్ సమ్మిట్‌కు సాంకేతిక భాగస్వామిగా ఎస్​ఆర్​ఎం (SRM) యూనివర్శిటీ - మానవ జీవితాన్ని సరళతరం చేసేలా డ్రోన్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

SRM University Experts said Amaravati Drone Summit 2024 Very Useful
SRM University Experts said Amaravati Drone Summit 2024 Very Useful (ETV Bharat)

SRM University Experts said Amaravati Drone Summit 2024 Very Useful :డ్రోన్ల వినియోగాన్ని సరికొత్త రంగాలకు విస్తరించేందుకు డ్రోన్ సమ్మిట్ ఎంతగానో ఉపయోగపడనుందని అమరావతిలోని ఎస్​ఆర్​ఎం(SRM) విశ్వవిద్యాలయం నిపుణులు అభిప్రాయపడ్డారు. డ్రోన్ సమ్మిట్​కు ఎస్.ఆర్.ఎం యూనివర్శిటి సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ సమ్మేళనం ద్వారా కలిగే ప్రయోజనాలను వర్శిటీ నిపుణులు ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

మానవ జీవితాన్ని సరళతరం చేసేలా ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేలా డ్రోన్లు భవిష్యత్తులో క్రియాశీల పాత్ర పోషిస్తాయన్నారు. అలాగే డ్రోన్ల వినియోగం, విస్తరణ, పరిశోధనలకు సంబంధించి విధానాల రూపకల్పన జరగనుందని వెల్లడించారు. డ్రోన్ల వినియోగం పెంచేలా ప్రభుత్వం చొరవ తీసుకోవడంపై నిపుణులు హర్షం వ్యక్తం చేశారు.

"ఈ మధ్యకాలంలో డ్రోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వీటిపై దృష్టి పెట్టాయి. మొన్న రాష్ట్రంలో వచ్చిన వరదల్లో డ్రోన్లు ఏ విధంగా ఉపయోగపడ్డాయో అందరం చూశాం. ఈ డ్రోన్ల వినియోగం వివిధ రంగాల్లో విస్తారించాలంటే సంబంధిత నిపుణులు ఒకే తాటిపైకి వచ్చి చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకు అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ఎంతగానో ఉపయోగపడుతుంది." - ఎస్​ఆర్​ఎం విశ్వవిద్యాలయం అధ్యాపకులు

డ్రోన్స్ త‌యారీ కేంద్రంగా భారత్‌ :అయితే డ్రోన్స్ సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి దిక్సూచిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్స్ వినియోగానికే కాదు, తయారీకీ ఏపీని కేంద్రంగా నిల‌పాల‌నే వ్యూహాత్మక ప్రణాళికను ఈ నెల 22, 23న మంగ‌ళ‌గిరిలో జరిగే రెండ్రోజుల జాతీయ స‌ద‌స్సులో చాటనుంది. డ్రోన్స్ సాంకేతిక సౌల‌భ్యాన్ని స‌మ‌ర్థంగా వినియోగించుకుని ప‌లు దేశాలు అద్భుత‌మైన ఫ‌లితాలు సాధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో 2030 క‌ల్లా డ్రోన్స్ త‌యారీ కేంద్రంగా భారత్‌ను నిలిపేలా వ్యూహరచన చేస్తోంది.

14 రంగాల్లో అపార అవ‌కాశాలు :ర‌క్షణ‌, సాంకేతిక‌, వ్యవ‌సాయ‌, రెవెన్యూ, పంచాయ‌తీ, విద్యుత్తు, ర‌హ‌దారులు, విప‌త్తుల నిర్వహ‌ణ వంటి 14 రంగాల్లో డ్రోన్స్ వినియోగానికి అపార అవ‌కాశాలున్నాయి. ఈ అవకాశాన్ని అందరికంటే ముందే అందిపుచ్చుకుని, ఏపీని డ్రోన్స్ క్యాపిట‌ల్‌గా మార్చాల‌ని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పాల‌న‌లో, విప‌త్తుల నిర్వహ‌ణ‌లో, ప్రజ‌ల దైనందిన జీవితంలో డ్రోన్స్ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని స‌త్ఫలితాలు సాధించడంపై ప్రభుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 22, 23తేదీల్లో మంగళగిరిలో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024ను నిర్వహిస్తోంది.

డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా 'అమరావతి'! - దేశంలోనే మొదటిసారిగా 5,500 డ్రోన్లతో షో

సరికొత్త డ్రోన్లు ఆవిష్కరించిన 'విజయవాడ' విద్యార్థులు - అమరావతి డ్రోన్ సమ్మిట్​కు సిద్ధం

ABOUT THE AUTHOR

...view details