ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ సమీపంలో అతి పెద్ద రాజకోట - చైనావాల్​ను తలపించే నిర్మాణాలు - కబుర్లు చెప్పే శిల్పాలు

'సెల్‌ఫోన్‌తో స్కాన్‌ చేస్తే - అక్కడ చిత్రాలు, శిల్పాలు మాట్లాడతాయి'

KONDAPALLI_FORT
KONDAPALLI_FORT (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2024, 2:54 PM IST

Special Story on Kondapalli Fort in NTR District :అది శత్రుదుర్భేద్యమైన దుర్గం. ఎత్తైన భవనాలు రాతి బురుజులు రాజమహళ్లు, పెద్ద కొలనులు.. ఇలా అడుగడుగునా రాజసం ఉట్టిపడే అలనాటి చారిత్రక కట్టడాలు, కళాఖండాలు కొండపల్లి ఖిల్లా పేరు చెప్పగానే ఇవే కళ్లముందు కదలాడుతాయి. ఈ కోట ఎన్టీఆర్​ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఉంది.

తెలుగు నేలపై పేరొందిన చారిత్రక పర్యాటక ప్రాంతాల్లో కొండపల్లి కోట ఒకటి. తూర్పు కనుమల్లో కొలువైన కొండపల్లి ఖిల్లా సందర్శకులను కట్టిపడేస్తోంది. పదో శతాబ్దం నుంచి ఎంతో మంది రాజుల దండయాత్రలను తట్టుకొని నిల్చున్న కోటనే కొండపల్లి. అక్కడి శిల్పాలు నేటి తరం వారికి ఎన్నో కబుర్లు చెబుతున్నాయి. కూలిన గోడలతో ఉన్న దర్బార్, రాణీ మహల్, జైల్‌ఖానా, నాట్యశాలను చూసి అప్పటి నిర్మాణ శైలి గురించి తెలుసుకోవచ్చు.

నిర్మానుష్యంగా కొండపల్లి కోట - పాలకుల నిర్లక్ష్యమే కారణమా! - Kondapally Fort

గ్యాలరీలోని చిత్రాలు, శిల్పాలను మొబైల్​తో స్కాన్‌ చేస్తే వాటి నోటే వివరాలు వినొచ్చు. ఈ ఆగ్మెంటెడ్‌ రియాలిటీ సాంకేతికత (Augmented Reality Technology) టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో లేజర్‌ షోతో ఏటా ఉత్సవాలు నిర్వహించి పర్యాటకులకు కనువిందు చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఉత్సవాలు బందయ్యాయి. విజయవాడకు 23 కిలోమీటర్లు దూరంలోనే ఉండటం వల్ల ఖిల్లాను అభివృద్ధి చేస్తే పర్యాటకులను ఆకట్టుకుంటుందని స్థానికులు తెలియజేస్తున్నారు. ముందుగా కొండపైకి వెళ్లేందుకు వాహనాలు, కోట వద్ద మంచినీటి సౌకర్యం కల్పించి ప్రచారం చేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

చరిత్ర సాక్ష్యాలుగా మొగల్రాజపురం గుహలు - వారి ఆవాసం కోసం నిర్మించినవేనా?

అజంతా అందాలతో ఏలూరు జిల్లాలో ప్రాచీన బౌద్ధారామం - GUNTUPALLI BUDDHIST CAVES

ABOUT THE AUTHOR

...view details