ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత నాయకులదే : స్పీకర్ అయ్యన్న - Speaker Ayyanna Instructions MLAs

Speaker Ayyanna Instructions to MLAs in AP : ఏపీ ప్రజలు ఇచ్చిన అద్భుతమైన మెజార్టీతో అధికారం ఇచ్చింది పదవుల కోసం కాదని, వారంతా మనపై ఉంచిన బాధ్యతగా గుర్తెరిగి నడుచుకోవాలని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టోయారన్న ఆయన వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దేలా సభలో అర్థవంతమైన చర్చ జరగాలని చెప్పారు. అందుకోసం అవసరమైతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కోసం శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు అయ్యన్న తెలిపారు.

Speaker Ayyanna Instructions to MLAs
Speaker Ayyanna Instructions to MLAs (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 10:33 PM IST

Updated : Jun 22, 2024, 10:47 PM IST

Ayyanna Patrudu on MLAs : రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు నూతనగా ఎన్నికైన సభాపతి అయ్యన్నపాత్రుడు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా శాసనసభ సభ్యులంతా పనిచేయాలన్నారు. నియోజకవర్గ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్క సభ్యునికి అవకాశం కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. తద్వారా అర్థవంతమైన చర్చల ద్వారా ప్రజలకు మేలు జరగుతుందని, ఏపీ అభివృద్ధి దిశగా సాగేందుకు దోహదపడుతుందని అయ్యన్నపాత్రుడు సూచించారు.

AP Assembly Sessions 2024 : అంతకుముందు ఏపీ శాసనసభ స్పీకర్​గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభా సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ తరపున మంత్రి సత్యకుమార్​లు ఆయణ్ని సభాపతి స్థానంలో కూర్చొబెట్టారు. విస్తృత అనుభవం కలిగిన నేతగా తన తీరుకు భిన్నంగా ఆయన పనిచేయాల్సి ఉందని వారు అన్నారు.

మరోవైపు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలతో పాటు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ సభలో 33 శాతం మంది పోస్ట్​ గ్రాడ్యుయేట్లు, 39 శాతం మంది గ్రాడ్యుయేట్లు లాంటి ఉన్నత విద్యావంతులు ఉన్నారని పేర్కొన్నారు. అసెంబ్లీకి 20 మందికి పైగా మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికవ్వడం ఎంతో సంతోషదాయకమని అయ్యన్నపాత్రుడు తెలిపారు.

శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరగాలి :కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సీనియర్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. అదేవిధంగా తొలిసారే 9 మంది శాసనసభ్యులకు మంత్రిపదవులు ఇవ్వటం సంతోషదాయకమని అన్నారు. విషయ పరిజ్ఞానం పెంచుకోవడం ద్వారా సభాసమయం వృథాకాకుండా ఉండటమేగాక, మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ ప్రాంత ప్రజలకు న్యాయం జరగుతుందని చెప్పారు. అందరూ కోరుకుంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తామని అయ్యన్నపాత్రుడు తెలిపారు.

''రాజ్యాంగ పదవిగా ఉండే సభాపతి స్థానాన్ని చేపట్టానని అయితే తనకు జీవితాన్నిచ్చిన తెలుగుదేశం పార్టీని మర్చిపోలేను. సభలో సంప్రదాయాలు, నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే. ప్రశ్నవేసేందుకు నేర్చుకోవాలి. శాసనసభను ప్రజలు నిత్యం గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలి. పదవి పండుగకాదు బాధ్యగా తీసుకోవాలి. ఇక నుంచి స్పీకర్ తక్కువ సభ్యులు ఎక్కువగా మాట్లాడేలా చర్యలు తీసుకుంటాం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తాం." - స్పీకర్ అయ్యన్నపాత్రుడు

చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎవరు ఏమన్నారంటే? - AP Assembly Sessions 2024

దేవుడి స్క్రిప్ట్​తోనే వైఎస్సార్​సీపీ 11 సీట్లు- పిరికితనంతో జగన్ పారిపోయాడు: చంద్రబాబు - CM Chandrababu on YSRCP

Last Updated : Jun 22, 2024, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details