SC Railway Cancelled Many Trains : భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భద్రతా కారణాల రీత్యా వీటిని రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. శని, ఆది, సోమవారాల్లో 20 వరకు రైళ్లు రద్దయ్యాయి.
విజయవాడ- తెనాలి, విజయవాడ- గూడురు, తెనాలి- రేపల్లె, గుడివాడ- మచిలీపట్నం, భీమవరం- నిడదవోలు, గుంటూరు- రేపల్లె, విజయవాడ- మచిలీపట్నం, విజయవాడ- ఒంగోలు తదితర టౌన్ల మధ్య రాకపోకలు సాగించే రైళ్లు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన పలు రైళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి...
South Central Railway has Cancelled Many Trains (ETV Bharat) South Central Railway Set up Helpline Numbers: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 20కి పైగా రైళ్ల రద్దు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే రైళ్ల వేళలు, రద్దయిన రైళ్ల వివరాలు, దారి మళ్లించిన రైళ్ల వివరాలు, ఇతర సదుపాయాల కోసం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికులు ఆయా నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, ప్రధాన స్టేషన్లలో హెల్ప్ డెస్కులనూ ఏర్పాటు చేసింది.
హెల్ప్ లైన్ నంబర్స్
- హైదరాబాద్ : 27781500
- సికింద్రాబాద్ : 27786140, 27786170
- కాజీపేట : 27782660,8702576430
- వరంగల్ : 27782751
- ఖమ్మం : 27782985,08742-224541,7815955306
- విజయవాడ : 7569305697
- రాజమండ్రి : 0883-2420541,0883-2420543