South Asia Largest International Poultry Exhibition in Hyderabad :దక్షిణాసియాలో అతిపెద్ద అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శనకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. వ్యవసాయ అనుబంధ రంగమైన పౌల్ట్రీ పరిశ్రమలో వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో 16వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 2024 కార్యక్రమం జరగనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి 29 తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రదర్శనలో భారత్‌తో పాటు 50 దేశాల కంపెనీలు, పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులు ప్రదర్శించనున్నారు.
అంతర్జాతీయంగా పౌల్ట్రీ రంగంలో వస్తున్న కొత్త మార్పులు, వినూత్న ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రదర్శించడానికి పారిశ్రామిక వేత్తలు, రైతులకు సువర్ణ అవకాశం అని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బయాస్ వెల్లడించారు. ఫార్మా, ఎక్విప్‌మెంట్, ఫీడ్, బ్రీడింగ్ టెక్నాలజీ ద్వారా పౌల్ట్రీ రంగం సాధిస్తున్న వృద్ధి అంశాలు వంటివి ప్రదర్శించనున్నారు.