Son Obstructs Father Funeral In Telangana :మానవ సంబంధాలన్నీ నేడు డబ్బు సంబంధాలుగా మారిపోయాయి. అలా డబ్బే ముఖ్యం అనుకుంటూ కన్నవాళ్లను కూడా పట్టించుకోవట్లేదు. తానే ప్రపంచం అనుకొని తండ్రి చిన్నప్పుడు ఒక పూట తినకున్నా, తన పిల్లలను చదివించుకొని ప్రయోజకులను చేస్తాడు. కానీ పిల్లలు పెద్దయ్యాక ఆస్తుల కోసం తల్లిదండ్రులనే విడిచిపెడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆస్తి పంపకాలు తేలేవరకు తండ్రి దహన సంస్కారాలు చేయనని కుమారుడు నిరాకరించారు. అంత్యక్రియలు జరపకుండా మూడు రోజులు శవపేటికలోనే ఉంచారు. బిడ్డలు ఉన్నా అనాథగా తండ్రి మృతదేహాన్ని వదిలేయడం గ్రామస్థుల హృదయాల్ని కలచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే,
Son Stopped Father Funeral :తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం సదర్షాపురానికి చెందిన ఆలకుంట్ల బాలయ్య (62) అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. మృతినికి భార్య లింగమ్మ, కుమారులు సురేష్, నరేష్, కుమార్తెలు శోభ, సోని ఉన్నారు. తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో మృతుని భార్య లింగమ్మ తన అన్న రాములు ఇద్దరు కలిసి 30 సంవత్సరాల క్రితం 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో అర ఎకరం భూమి విక్రయించారు. లింగమ్మకు రావాల్సిన ఒక ఎకరం 10 గుంటల భూమిని రాములు తన కుమార్తె లింగమ్మ, బాలయ్య పెద్ద కోడలు (నరేష్ భార్య అరుణ)కు పట్టా చేసి ఇచ్చాడు.