Son And Daughter-In-Law Killed Their Mother for Gold in Vijayawada : నవమాసాలు మోసి, జన్మనిచ్చిందనే కనికరం కూడా లేకుండా తన తల్లి ముఖంపై దిండు అదిమిపట్టి చంపేశాడో ఓ కొడుకు. మరో ఘటనలో కుటుంబ కలహాలతో కన్న తండ్రినే గొడ్డలితో వేటు వేసి బలితీసుకున్నాడు మరో పుత్రరత్నం. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ రెండు ఘటనలతో స్థానికులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.
దిండుతో ఊపిరాడకుండా చేసి..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడలోని గుణదల పోలీసు స్టేషన్ పరిధిలో పప్పులమిల్లో గత కొంతకాలంగా లక్ష్మి(62)ని ఆమె పెద్ద కుమారుడు సాంబ శివరావు నివాసం ఉంటున్నారు. ఇటీవల తల్లి,కుమారుడు మద్య ఆస్తి తగాదా నడుస్తోంది. తల్ల వద్ద ఉన్న బంగారం కావాలని కుమారుడు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాడు. తల్లి నిరాకరించడంతో ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తన భార్యతో కలిసి మరీ మధ్యరాత్రి వేళలో నిద్రిసుండగా తన తల్లి గొంతు నులిమి, దిండుతో ఇరువురూ కలిసి లక్ష్మిని కడతేర్చారు. ఈ నోటా ఆ నోట సమాచారం పోలీసులకు చేరడంతో ఈ వీరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4లక్షల విలువ చేసే బంగారు అభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.