Smugglers Cultivating Ganja Visakhapatnam:రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు విశాఖలోనే ఉంటున్నాయి. అయితే ఈ సారి ఏకంగా విశాఖ నడిబొడ్డున గంజాయి సాగు చేయడం నగర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేజీహెచ్ కొండపై బాలికల వసతి గృహం వెనుక ఉన్న ప్రాంతంలో కొంతమంది స్మగ్లర్లు గంజాయి పండిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి స్మగ్లర్లు కొండపై గంజాయి సాగు చేస్తున్నారు. నేవీ పరిధిలో ఉన్న ప్రాంతంలో గంజాయి సాగు చేయడం నగర వాసులను ఆందోళన కలిగిస్తోంది.
దీనికి సంబంధించి కొంత మంది యువకులను విశాఖ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు కొండపై భారీ స్థాయిలో గంజాయిని సాగు చేస్తున్నారని, దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గంజాయి సాగు వెనక ఎవరున్నారనే దానిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఆ యువకులంతా ముఠాగా ఏర్పడి గంజాయి సాగు చేస్తున్నారా లేదా ఆకతాయితనంగా చేస్తున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
విశాఖ నడిబొడ్డున గంజాయి సాగు - పోలీసుల అదుపులో యువకులు (ETV Bharat) విద్యార్థులను దారి మళ్లిస్తున్న భయాలివే - కనిపెట్టుకోకుంటే కన్నీళ్లే!
50 కేజీల గంజాయి స్వాధీనం: అన్నమయ్య జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ఎక్కువైపోయింది. ఇక్కడి పోలీసులు రోజూ ఏదో ఒక ప్రాంతంలో గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం గంజాయి కట్టడి చేయడంలో విఫలమవడంతో ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లను కట్టడి చేస్తోంది. తాజాగా జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్‌లో 10 లక్షల రూపాయల విలువైన గంజాయి, ఒక కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చిట్వేల్‌లోని అనుపల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రాపూర్ నుంచి చిట్వేలికి 50 కేజీల గంజాయిని కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేసిన వ్యక్తి కాళహస్తికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి 50 కేజీల వరకు ఉంటుందని దీని విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గంజాయి సమాచారం తెలిస్తే ప్రజలు పోలీసులకు తెలపాలని అన్నారు.
బల్బులో డ్రగ్స్ - బెంగళూరు టు హైదరాబాద్ వయా గుంటూరు
'గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌ల బారి నుంచి మా కాలనీని కాపాడండి' - Ganjai Blade Batch in Vijayawada