ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారా లోకేశ్​తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భేటీ - మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు - Adimulam met Lokesh

YSRCP MLA Koneti Adimulam: సత్యవేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ను కలిశారు. తన కుమారుడితో కలిసి లోకేశ్​తో సమావేశమయ్యారు. తెలుగుదేశంలో చేరే అంశంపై చర్చించారు. వైఎస్సార్సీపీలో ఎస్సీలకు కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా సీట్లను మారుస్తున్నారని ఈ సందర్భంగా మాట్లాడిన ఆదిమూలం ఆరోపించారు.

YSRCP MLA Koneti Adimulam
YSRCP MLA Koneti Adimulam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 7:17 PM IST

YSRCP MLA Koneti Adimulam: వైఎస్సార్సీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల కేటాయింపులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ రాని నేతలు, తాము అనుకున్న చోట కాకుండా మరో చోట టికెట్ వచ్చిన నాయకులూ పార్టీ పెద్దల తీరుపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. తాజాగా సత్యవేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సైతం అసంతృప్తి నేతల జాబితాలో చేరారు. టికెట్ కేటాయింపు అంశంపై అసంతృప్తిలో ఉన్న ఆయన నేడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​తో భేటీ అయ్యారు.

నారా లోకేశ్​తో భేటీ:సత్యవేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నారా లోకేశ్​ని హైదరాబాద్​లో కలిశారు. తన కుమారుడితో కలిసి లోకేశ్ తో సమావేశమైన ఆదిమూలం తెలుగుదేశంలో చేరే అంశంపై లోకేశ్ తో చర్చించారు. వైఎస్సార్సీపీ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆదిమూలం లోకేశ్​తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆదిమూలం విడుదల చేసిన ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. టికెట్ కేటాయింపు అంశంపై వైఎస్సార్సీపీ పెద్దలు దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆదిమూలం ఎండగట్టారు.
ఆదిమూలం ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే!

పెద్దిరెడ్డి ఫలితం అనుభవిస్తారు: సీఎం జగన్ తనకు తిరుపతి ఎంపీ టికెట్ ఇస్తామన్నా తిరస్కరించినట్లు పేర్కొన్నారు. తాను కేవలం ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఆదిమూలం వెల్లడించారు. ఇతర నేతల్లా తాను దోచుకుని, దాచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న పెద్దిరెడ్డి ఫలితం అనుభవిస్తారని ఆదిమూలం విమర్శలు గుప్పించారు. తనపై పెద్దిరెడ్డి కుట్రపన్ని నాయకులను ఉసిగొల్పుతున్నారని ఆదిమూలం ఆరోపించారు. అక్రమాలు చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆదిమూలం వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఇప్పటికే ఆదిమూలం కి తిరుపతి ఎంపీ టికెట్ కేటాయించగా, ఆ పార్టీపై పై తిరుగుబాటు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన నేడు హైదరాబాద్ లో నారా లోకేశ్​ను కలవటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

పొగిడిన నేతలే, తాజాగా విమర్శలు: తాను పెద్దిరెడ్డిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలను పెద్దిరెడ్డి ఉసిగొలుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన నేతలకు ఎమ్మెల్యేను తిట్టాలని పేర్కొంటూ వైఎస్సార్సీపీ పెద్దల నుంచి ఆదేశాలు అందాయనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు ఎమ్మెల్యేను పొగిడిన నేతలే, తాజాగా ఆయనపై విమర్శలు గుప్పించారు. సత్యవేడు జడ్పీటీసీ భర్త చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీపీ భర్త సుశీల్‌కుమార్‌రెడ్డి, సింగిల్‌ విండో ఛైర్మన్‌ నిరంజన్‌రెడ్డిలు ఆదిమూలంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వైఎస్సార్సీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే లోకేశ్ తో ఆదిమూలం భేటీ అయ్యారనే వార్తలు వెలువడుతున్నాయి.

ఎమ్మెల్యే టికెట్‌ రాకుండా కుట్ర చేసింది పెద్దిరెడ్డే: వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం

ABOUT THE AUTHOR

...view details