ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామాలు బాగు పడాలంటే జగన్​ను ఓడించాలి: సర్పంచుల సంఘం - Sarpanch agitation in anantapur

Sarpanch Protest To Fullfill 16 Demands: పంచాయితీ నిధులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దోచుకుని, సొంత అవసరాలకు వాడుకుందని పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే సర్పంచుల సంఘం, పంచాయతీ చాంబర్లు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడించడానికి పని చేస్తామని హెచ్చరించారు.

Sarpanch_Protest_To_Fullfill_16_Demands
Sarpanch_Protest_To_Fullfill_16_Demands

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 3:12 PM IST

Sarpanch Protest To Fullfill 16 Demands: కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన సుమారు 50 వేల కోట్ల రూపాయిలు నిధులు పంచాయితీ ఖాతాల నుంచి జగన్మోహన్ రెడ్డి దొంగలించారని పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. పంచాయతీలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్​ను రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

ఉపాధి బిల్లులకోసం ... సర్పంచ్​ల నిరసన

కలెక్టర్ వద్ద సర్పంచుల నిరసన: గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించాలనే నినాదాలతో అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సర్పంచులతో కలిసి రాజేంద్రప్రసాద్ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి సర్పంచులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు కలిసి రావాలని రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 12,918 గ్రామాల్లోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు వైఎస్సార్సీపీ హయాంలో తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు.

Panchayat Raj Chamber State President Rajendra Prasad: సర్పంచులు కేవలం ఉత్సవ విగ్రహాల ఉండే పరిస్థితి నెలకొందని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే గ్రామాలు శిథిలమై, గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించిన 14, 15వ ఆర్థిక సంఘం వేలకోట్ల నిధులను ప్రభుత్వం మళ్లించిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి తన సొంత పథకాలకు, అవసరాలకు నిధులను దారి మళ్లించి వాడుకున్నారని, ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్పంచ్​ల 16 డిమాండ్లతో కూడిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించకపోతే సర్పంచుల సంఘం, పంచాయతీ చాంబర్లు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడించడానికి పనిచేస్తామని సర్పంచుల సంఘం నేతలు హెచ్చరించారు.

AP Sarpanches Meeting: 'నిధులివ్వకుంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాం..'

"మహాత్మాగాంధీ కలలుకన్న స్వరాజ్యాన్ని సాధించానని చెప్తూ ప్రజలను జగన్ మోసం చేస్తున్నారు. గ్రామీణ ప్రజలకు సౌకర్యాలు, ఉపాధి కల్పించకుండా మహాత్మాగాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని ఎలా సాధించారని చెప్తున్నారు. పంచాయితీ వ్యవస్థ నిర్వీర్యమైంది. గత 3సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి దిల్లీ స్థాయి వరకూ అనేక పోరాటాలు చేశాం. సర్పంచుల మనుగడ సాధించి, గ్రామాలు బాగు పడాలంటే జగన్​ను అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి." -రాజేంద్రప్రసాద్, పంచాయతీరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

వైఎస్సార్సీపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతాం: బాబు రాజేంద్ర ప్రసాద్

ABOUT THE AUTHOR

...view details