RTC Workers Problems In Andhra Pradesh :అసలే డొక్కు బస్సులు, ఆపై గుంతల రోడ్లు, ప్రమాదం జరిగితే కఠినమైన శిక్షలు, విరివిగా సౌకర్యాల కోతలు, నియామకాల వాయిదాలు ఇవీ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ డ్రైవర్ల దీన పరిస్థితులు. బ్రేకులు ఫెయిల్ అయ్యి కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, అదుపు తప్పి గుడిసెను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, బస్‌స్టాండ్‌లో ప్రయాణికుల మీదికి దూసుకెళ్లిన బస్సు ఇలా ఎక్కడ చూసినా ఆర్టీసీ అవస్థలు కళ్లకు కట్టినట్టు కనబడుతున్నా పట్టించుకే నాథుడే లేడని ఆర్టీసీ డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.
RTC Workers Protest in Vijayawada :ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగుల స్థానంలో తక్షణమే భర్తీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రిటైర్డ్ అయిన వారి స్థానంలో నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్న ఉద్యోగులపై అదనపు పని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగుల బకాయిలన్నీ తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టంతో రవాణా రంగం ప్రమాదంలో పడే అవకాశం ఉందని వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాబోయే బడ్జెట్లో నూతన బస్సులు కొనేందుకు ఆర్టీసీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే తమ ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆర్టీసీలో డొక్కు బస్సులు కనిపించడం లేదా జగన్ - 53 శాతం కాలం చెల్లిన బస్సులే?