ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బియ్యం ఎగుమతుల్లో కాకినాడ 'కీ' పోర్టు - అంతర్జాతీయస్థాయిలో రేషన్ మాఫియా! - RATION RICE SMUGGLING

మూడేళ్లలో 48,537 కోట్ల రూపాయల ఎగుమతులు - 137 మిల్లుల నుంచి కాకినాడకు రేషన్ బియ్యం

Ration_Rice_Smuggling
Ration Rice Smuggling (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Ration Rice Smuggling: 'పుష్ప అంటే నేషనల్‌ అనుకుంటిరా, ఇంటర్నేషనల్‌' ఈ మధ్య విడుదలైన 'పుష్ప 2' చిత్రంలోని డైలాగ్‌ ఇది. కాకినాడను కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చుకున్న రేషన్‌ మాఫియాది కూడా ఇదే రూటు. ఇక్కడ జరిగిన అక్రమాల చిట్టా చెప్పాలంటే చాంతాడంత అవుతుంది. వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని, తమ చేతికి బియ్యం గింజ అంటకుండా వేల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం సాగించినోళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఈ రేషన్ మాఫియా సామ్రాజ్యానికి కర్త-కర్మ-క్రియ మాత్రం తెరవెనుక మరొకరు ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. అక్రమాలపై ఆరా తీస్తుంటే, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, దాటేసి ఇంటర్నేషన్ స్థాయి వరకూ అక్రమాల సామ్రాజ్యం వెలుగుచూస్తోంది.

గడిచిన ఐదు సంవత్సరాలూ కాకినాడ పోర్టులపై విమర్శలు వస్తున్నా, అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీగ లాగితే, రేషన్ మాఫియా డొంక కదిలింది. వివిధ రాష్ట్రాల్లో 137 మిల్లుల నుంచి కాకినాడలోని ఎగుమతిదారులకు రేషన్ బియ్యం వచ్చినట్లు తేలింది. రాష్ట్రంలో ఏ పోర్టులో సాధ్యం కానంతగా రికార్డు స్థాయిలో కాకినాడ పోర్టు నుంచి గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 48 వేల 537 కోట్ల రూపాయల విలువైన 1.31 కోట్ల టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతి అయ్యిందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా చెప్పారు. ఇందులో రేషన్ బియ్యమే అధికమన్నది ఆరోపణ. గత ఎగుమతుల్లో అక్రమం ఎంత, సక్రమం ఎంత అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

అధికారులు ఆరాతీస్తే: ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న కాకినాడ యాంకరేజి పోర్టుతో పాటు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులోని ఎగుమతులు-దిగుమతులు జరుగుతున్నాయి. అయితే డీప్‌వాటర్‌ పోర్టుకి సంబంధించిన వాటాలు బలవంతంగా చేతులు మారాయన్న కేవీ రావు ఫిర్యాదుపై సీఐడీ విచారణ చేస్తోంది. గడిచిన అయిదు సంవత్సరాల్లో కార్గోతోపాటు లావాదేవీల డాక్యుమెంట్స్​ ఇటీవల సీఐడీ స్వాధీనం చేసుకుంది. యాంకరేజీ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులపైనా సిట్‌ బృందం ఆరాతీయనున్నట్లు తెలుస్తోంది.

కాకినాడ యాంకరేజి పోర్టు ద్వారా సిమెంట్, రా, బాయిల్డ్, బోక్రెన్‌ రైస్‌, మొక్కజొన్న 2019-20 నుంచి 2023-24 (నవంబర్‌ వరకు) 1.55 కోట్ల టన్నుల నిల్వలు ఎగుమతి అయ్యాయి. అయితే 2022-23 నుంచి 2024-25 వరకు కేవలం బియ్యం ఎగుమతులు మాత్రమే ఇక్కడ నుంచి జరగడం గమనార్హం. డీప్‌ వాటర్‌ పోర్టులో ఎడిబుల్‌ ఆయిల్, ఆహార ధాన్యాలు, బొగ్గు, ఐరన్‌ ఓర్, ఎరువులు, పంచదార ఇతరత్రా నిల్వల ఎగుమతులు, దిగుమతులు 2019-20 నుంచి 2023-24 వరకు 7.87 కోట్ల టన్నులు జరిగాయి. ఈ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు 2021లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఐదు సంవత్సరాల్లో ఎగుమతుల్లో బియ్యం నిల్వలు ఎంతన్నది స్పష్టత రావాల్సి ఉంది.

అంతర్జాతీయ స్థాయిలో రేషన్ మాఫియా - వివిధ రాష్ట్రాల నుంచి కాకినాడ పోర్టు వరకూ

బ్లాక్​ లిస్టులోకి పేర్ని నాని గోడౌన్​! - రేషన్‌ బియ్యం మచిలీపట్నం తరలింపు

ABOUT THE AUTHOR

...view details